Viral Pic: ఇటలీ ప్రధానితో ఎలాన్‌ మస్క్ డేటింగ్‌లో ఉన్నాడా? ఆయన ఏం చెప్పారో తెలుసా?

మెలోనితో ఎలాన్‌ మస్క్‌ డిన్నర్‌ చేస్తూ మాట్లాడుతున్నట్లు..

Viral Pic: ఇటలీ ప్రధానితో ఎలాన్‌ మస్క్ డేటింగ్‌లో ఉన్నాడా? ఆయన ఏం చెప్పారో తెలుసా?

Updated On : September 26, 2024 / 7:45 AM IST

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ డేటింగ్‌ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఎలాన్ మస్క్ చెక్ చెప్పారు. మెలోనితో ఎలాన్‌ మస్క్‌ డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న ప్రచారానికి ఓ ఫొటోనే కారణం.

మెలోనితో ఎలాన్‌ మస్క్‌ డిన్నర్‌ చేస్తూ మాట్లాడుతున్నట్లు ఉన్న ఫొటోను తాజాగా అతడి ఫ్యాన్ క్లబ్‌ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దానికి ‘వీరు డేటింగ్‌ చేస్తారని మీరు అనుకుంటున్నారా?’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై స్పందించిన ఎలాన్‌ మస్క్‌ తాను ‘మేము డేటింగ్‌లో లేము’ అని రిప్లై ఇచ్చారు.

మరో ఎక్స్‌ యూజర్‌ కూడా ఇదే ఫొటోను షేర్‌ చేయగా దానికి కూడా ఎలాన్‌ మస్క్‌ రిప్లై ఇచ్చారు. ‘నేను మా అమ్మతో కలిసి అక్కడ ఉన్నాను. ప్రధాని మెలోనితో కలిసి ఎటువంటి రొమాంటిక్‌షిప్పూ లేదు’ అని చెప్పారు.

కాగా, సెప్టెంబరు 24న న్యూయార్క్‌లో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో మెలోనిని ఎలాన్‌మస్క్‌ ప్రశంసించిన తర్వాత వారిద్దరికి సంబంధించిన వదంతులు ఎక్కువయ్యాయి. అన్ని వదంతులకూ ఎలాన్ మస్క్‌ ఎక్స్‌లోనే రిప్లైతో సమాధానం చెప్పినట్లు అయింది.

ఘోర ప్రమాదం గురించి లైవ్‌లో చెబుతున్న యాంకరమ్మ.. ఆమె వెనుక నిలబడి యువకుడి డ్యాన్స్‌