Shia Muslims: షియా ముస్లింలను వదిలిపెట్టం.. ఎక్కడ ఉన్నా దాడి చేస్తాం -ISIS

ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రవాద సంస్థ.. షియా ముస్లింలను వదిలే ప్రశక్తే లేదంటూ, వారు అత్యంత ప్రమాదకారులని హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

Shia Muslims: ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రవాద సంస్థ.. షియా ముస్లింలను వదిలే ప్రశక్తే లేదంటూ, వారు అత్యంత ప్రమాదకారులని హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. బాగ్దాద్ నుంచి ఖొరసాన్ వరకు షియా ముస్లింలను వదిలిపెట్టబోమని, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ నడుపుతున్న వారపత్రిక ‘అల్-నబ’లో ప్రకటన వచ్చింది.

షియా ముస్లింల ఇళ్లపై, వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడి చేస్తామని చెప్పింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌లో ఇమామ్ బర్గాహ్-ఈ-ఫాతిమా మసీదులో పేలుడుకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ -ఖొరసాన్ ప్రకటించింది.

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 60 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి గాయాలయ్యాయి. షియా ముస్లింల మసీదులో ఉగ్రవాదులు దారుణ హింసకు పాల్పడ్డారు. దీనిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా తప్పుబట్టింది. అక్టోబరు 8న ఆఫ్ఘనిస్థాన్‌లోని కుందుజ్‌లో కూడా షియా మసీదుపై ఉగ్రవాద దాడి జరగగా 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

ట్రెండింగ్ వార్తలు