Imran Khan: ఇటీవల తనపై కాల్పులు జరిగిన ప్రాంతం నుంచే మళ్ళీ ర్యాలీలో పాల్గొననున్న ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ర్యాలీని మళ్ళీ కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ‘ఖాన్ మళ్ళీ వస్తున్నారు’ అంటూ ఆయన పార్టీ పీటీఐ ప్రకటన చేసింది. ఈ నెల 3న ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ తో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ వజీరాబాద్‌లోని జఫారలీ ఖాన్ చౌక్ వద్ద ఆ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ అక్కడితో ఆగిపోయింది. అయితే, ర్యాలీ ఆగిపోయిన చోటు నుంచే ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ ర్యాలీ ప్రారంభించనున్నట్లు పీటీఐ పేర్కొంది.

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ర్యాలీని మళ్ళీ కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ‘ఖాన్ మళ్ళీ వస్తున్నారు’ అంటూ ఆయన పార్టీ పీటీఐ ప్రకటన చేసింది. ఈ నెల 3న ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ తో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ వజీరాబాద్‌లోని జఫారలీ ఖాన్ చౌక్ వద్ద ఆ ఘటన చోటుచేసుకుంది.
దీంతో ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ అక్కడితో ఆగిపోయింది. అయితే, ర్యాలీ ఆగిపోయిన చోటు నుంచే ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ ర్యాలీ ప్రారంభించనున్నట్లు పీటీఐ పేర్కొంది. ర్యాలీగా ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ కు వెళ్లనున్నారు. దీంతో పోలీసులు ఆయనకు హెచ్చరిక జారీచేశారు. ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘‘కేసులు నమోదైన రాజకీయ నాయకులను అరెస్టు చేస్తాము’’ అని ఇస్లామాబాద్ పోలీసులు ఓ ప్రకటన చేశారు.
అలాగే, అనుమానాస్పద కదలికలను ప్రజలు గుర్తిస్తే వెంటనే తమకు ఫోను చేసి చెప్పాలని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ర్యాలీకి అనుమతి లేదని, అయితే, ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ, విదేశ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి అన్నీ మార్గాలను తెరిచే ఉంచుతామని చెప్పారు.
రేపటి నుంచి మళ్ళీ ర్యాలీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో పీటీఐ నేతలను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇస్లామాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గాల్లో ఆందోళనలు జరుపుతూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
KHAN IS COMING :
Haqeeqi Azadi March will resume on Tuesday. pic.twitter.com/HqqamP5AHr— PTI (@PTIofficial) November 7, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..