Israel-Hamas War : కొన్ని నెలలుగా దాడులకు ప్రణాళిక.. అంతా రహస్యమే.. దాడికి ఐదు గంటలముందే వారికికూడా తెలిసిందట..

ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడే సమయంలో ఇజ్రాయెల్ దళాలు ఆ ప్రాంతంలో లేకపోవటం హమస్ ముష్కరులను ఆశ్చర్యానికి గురిచేసిందట. గాజాలోకి ప్రవేశించిన సమయంలోనూ ఇజ్రాయెల్ దళాలు కనిపించలేదట.

Israel Hamas War

Israel Hamas War Updates: ఇజ్రాయెల్ , హమాస్ మధ్య రగిలిన యుద్ధ జ్వాల మరణ మృదంగం మోగించింది. అత్యంత పాశవికంగా హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణకాండలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఐడీఎఫ్ బలగాలు ఓ హమాస్ సాయుధ ముష్కరుడిని అరెస్టు చేశాయి. ఈ క్రమంలో అతడు వెల్లడించిన వివరాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ఇజ్రాయెల్ తో తాము పోరాటానికి సిద్ధంగా లేమని సంకేతాలు గత కొన్నాళ్లుగా హమాస్ నుంచి వస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్ పై భారీ దాడికి కుట్రకు చాలాకాలంగా హమాస్ ప్రణాళిక రచించిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్ దళాలు హమాస్ పై కన్నేసి ఉంచినా అటువైపు నుంచి ఎటువంటి దాడి యత్నాలు లేకపోవటంతో, ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మెరుపు దాడిని ఊహించలేదు. ఇటీవల చిన్నచిన్న పాలస్తీనా గ్రూపులకు, ఇజ్రాయెల్ సేనలకు మధ్య జరిగిన ఘర్షణలో కూడా హమాస్ తలదూర్చకపోవటంతోపాటు పీఐజే, ఇతర సంస్థలు జరిపిన దాడుల్లోనూ పాల్గొనేందుకు హమాస్ నిరాకరించింది. కానీ, అప్పటికే ఇజ్రాయెల్ పై దాడికి రహస్యంగా సన్నద్ధమవుతున్నట్లు ప్రస్తుతం దాడులను బట్టి తెలుస్తోంది.

Israel-Hamas War : ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన 1500 మంది హమాస్ ముష్కరులు హతం ..

ఐడీఎఫ్ బలగాలు అరెస్టు చేసిన హమాస్ సాయుధ ముష్కరుడు వెల్లడించిన వివరాలు ప్రస్తుతం ఇజ్రాయెల్ దళాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇజ్రాయెల్ పై దాడి ప్రణాళిక కేవలం హమాస్ లోని కొంతమంది అగ్రనేతలకు మాత్రమే సమాచారం ఉందట. దాడికి ఐదు గంటల ముందు మాత్రమే సదరు అగ్రనేతలు తమకు దాడిచేస్తున్న ప్రాంతం గురించి చెప్పారని ఐడీఎఫ్ బలగాల చేతికి చిక్కిన హమాస్ సాయుధ ముష్కరుడు వెల్లడించాడు.

Israeli Embassy : ఢిల్లీ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భద్రత పెంపు

ఈ దాడిలో సుమారు వెయ్యి మంది పాల్గొన్నారని, మొత్తం 15 చోట్ల సరిహద్దు కంచెను కత్తిరించినట్లు చెప్పాడు. అయితే, వీరు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడే సమయంలో ఇజ్రాయెల్ దళాలు ఆ ప్రాంతంలో లేకపోవటం తమను ఆశ్చర్యానికి గురిచేసినట్లు పేర్కొన్నాడు. గాజాలోకి ప్రవేశించిన సమయంలోనూ ఇజ్రాయెల్ దళాలు కనిపించలేదట. అంతేకాదు.. హమాస్ సాయుధుల ట్రక్కులు అత్యాధునిక ఆయుధాలతో నిండిఉన్నాయని ఐడీఎఫ్ బలగాలకు పట్టుబడిన హమాస్ సాయుధ ముష్కరుడు వెల్లడించాడు.