Israeli Embassy : ఢిల్లీ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భద్రత పెంపు

Israeli Embassy : ఢిల్లీ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భద్రత పెంపు

security

Updated On : October 10, 2023 / 9:02 AM IST

Israeli Embassy : హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయం, భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి అధికారిక నివాసాల వద్ద ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. ఇజ్రాయెల్‌కు, ఉగ్రవాద సంస్థ హమాస్‌కు మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ అధికారిక నివాసం వెలుపల అదనపు పోలీసు వాహనాలను మోహరించారు.

Also Read :Israeli actor : హమాస్‌పై యుద్ధంలో పాల్గొన్న ఇజ్రాయెల్ టీవీ నటుడు

న్యూఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని యూదుల మతస్థలమైన చాబాద్ హౌస్ దగ్గర కూడా భద్రతను పెంచారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఉగ్రవాద లక్ష్యంగా ఉంది. 2021వ సంవత్సరంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర ఇంప్రూవ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ ని ఉగ్రవాదులు పేల్చారు. ఆ పేలుడులో ఎలాంటి గాయాలు కాలేదు.

Also Read :Israel : హమాస్‌కు వ్యతిరేకంగా పోరాటానికి 3 లక్షల ఇజ్రాయెల్ సైనికులు