Israel-Hamas War : ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన 1500 మంది హమాస్ ముష్కరులు హతం ..

ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దులో నిరంతరం బాంబుల దాడి చేస్తోంది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ బాంబుల దాడితో భారీ విధ్వంసం సృష్టించింది.

Israel-Hamas War : ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన 1500 మంది హమాస్ ముష్కరులు హతం ..

Israel-Hamas War

Israel Hamas War Updates: ఇజ్రాయెల్ , హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. అత్యంత పాశవికంగా హమాస్ ముష్కరులు జరిపిన మారణకాండలో మృతుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో వందలాది మంది మరణించారు. ఇదిలాఉంటే.. హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇజ్రాయెల్ కేవలం 48 గంటల్లో మూడు లక్షల మంది సైనికులను రంగంలోకి దించింది. దేశ సరిహద్దులోని 24 పట్టణాల్లో 15 పట్టణాలను సైన్యం ఖాళీ చేసిందని ఇజ్రాయెల్ ఆర్మీ అధికారి తెలిపారు. 48 గంటల్లో 3 లక్షల సైనికులను సమీకరించడం రికార్డు అని రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి చెప్పారు. శనివారం ఉదయం నుంచి ఇజ్రాయెల్‌పై పోరాటం ప్రారంభించినప్పటి నుంచి 4,400 రాకెట్లు ప్రయోగించారు.

Israeli Embassy : ఢిల్లీ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భద్రత పెంపు

ఇదిలాఉంటే.. ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దులో నిరంతరం బాంబుల దాడి చేస్తోంది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ బాంబుల దాడితో భారీ విధ్వంసం సృష్టించింది. ఇందులో హమాస్‌కు చెందిన 475 రాకెట్ వ్యవస్థలు, 73 కమాండ్ సెంటర్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇదిలాఉండగా, ఇజ్రాయెల్ సరిహద్దులోకి ప్రవేశించిన 1500 మంది హమాస్ ముష్కరులు హతమైనట్లు ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 1,500 మంది పాలస్తీనా ముష్కరుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఉన్నాయని ఇజ్రాయెలీ టీవీ ఛానెల్ 13 న్యూస్ నివేదించింది. శనివారం ఉదయం నుంచి ఇజ్రాయెల్ లోకి చొరబడిన వందలాది మంది హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జీహాదీ ముష్కరులను సైన్యం హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అంచనా వేసింది.

Israeli actor : హమాస్‌పై యుద్ధంలో పాల్గొన్న ఇజ్రాయెల్ టీవీ నటుడు

ఇదిలాఉంటే .. శనివారం దాడి నుంచి 700 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించారు. ఈ దాడిలో 2000 మందికి పైగా గాయపడ్డారు. గాజాలో బందీలుగా ఉన్న వారి సంఖ్య 100 కంటే ఎక్కువగా ఉందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. గాజా సరిహద్దులోని అన్ని పట్టణాలపై ఇజ్రాయెల్ దళాలు తిరిగి నియంత్రణ సాధించాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ టాప్ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.