పేలుతున్న బాంబులు, గాల్లో ప్రాణాలు..! ఈ యుద్ధం ఆగేదెలా? పశ్చిమాసియాలో ఏం జరగబోతోంది?
ఇరాన్ ఫైనల్ గా బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ మీద క్షిపణులతో విరుచుకుపడింది.

Israel Iran Conflict : సరిగ్గా ఏడాది కింద రగులుకున్న మంటలు.. పశ్చిమాసియాను నిప్పుల కుంపటిగా మార్చేశాయి. ఇజ్రాయెల్, హమాస్, హెజ్బొల్లా, ఇరాన్.. దాడులు చేసుకున్న వాళ్లు, ప్రతిఘటిస్తున్న వాళ్లు.. ఎవరికీ నిద్రలేదు. ఎక్కడి నుంచి ఏ బాంబు దూసుకొస్తుందో, ఏ క్షిపణి వచ్చి ప్రాణాల మీద కూలుతుందో.. అర్థం కాక, ఏమీ చేయలేక నరకం చూస్తున్నారు చాలామంది. యుద్ధం ఎవరిదైనా నలిగిపోతోంది మాత్రం సామాన్యులే.
యుద్ధానికి ఏడాది పూర్తైన వేళ.. హమాస్ మళ్లీ విజృంభిస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం మౌనంగానే ఉంది. ఈ సైలెన్స్ దేనికి సంకేతం. ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? ఈ ఏడాది యుద్ధం.. పశ్చిమాసియా ప్రాంతాన్ని, దేశాలను, ప్రపంచాన్ని ఎలా మార్చింది? ఈ యుద్ధానికి ఎండ్ ఉండదా? ఇజ్రాయెల్ భారీ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న వేళ వార్ ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది?
పశ్చిమాసియాపై ఏడాది యుద్ధం ప్రభావం ఎంత? అక్టోబర్ 7, 2023.. సరిగ్గా ఏడాది కింద జరిగిన నరమేధానికి ప్రపంచం ఉలిక్కిపడింది. ఇజ్రాయెల్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ పై హమాస్ తీవ్రవాదులు మెరుపు దాడులు చేశారు. హమాస్ చేసిన ఆ ఒక్క అటాక్.. మిడిల్ ఈస్ట్ దేశాలకు శాపంగా మారింది. నాడు హమాస్ మొదలు పెట్టిన యుద్ధానికి ఇజ్రాయెల్ ఇంకా జవాబు ఇస్తూనే ఉంది. హమాస్ ను క్లియర్ చేసింది. హిజ్బొల్లాకు చుక్కలు చూపించింది. హౌతీలను టార్గెట్ చేసింది. ఈ ఏడాదిలో చాలా జరిగాయి.
హమాస్, హెజ్బొల్లాకు పరోక్షంగా మద్దతుగా ఉన్న ఇరాన్ ఫైనల్ గా బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ మీద క్షిపణులతో విరుచుకుపడింది. అయితే, యుద్ధం మొదలై ఏడాది ముగిసిన వేళ… హమాస్ మళ్లీ రెచ్చిపోయింది. ఇజ్రాయెల్ పై వరుస దాడులు చేస్తోంది. ఇప్పటికే ఇరాన్ దాడి చేసింది. ఇప్పుడు హమాస్ అటాక్ చేస్తోంది. ఇంత జరుగుతున్న ఇజ్రాయెల్ మౌనంగా ఉండటం ఇప్పుడు కొత్త భయాలను సృష్టిస్తోంది.
పూర్తి వివరాలు..
Also Read : ప్రతి ఏటా మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరగడానికి కారణం అదేనా.. సైంటిస్టులు ఏం చెబుతున్నారు..