Israeli Strikes: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. ఎనిమిది మంది మృతి

గాజాపై శుక్రవారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. గాజాలోని హమాస్ తీవ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.

Israeli Strikes: గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక ఐదేళ్ల చిన్నారితోపాటు, ఒక తీవ్రవాది కూడా ఉన్నట్లు సమాచారం.

Amit Shah: ఆగష్టు 5న కాంగ్రెస్ నిరసన.. రామ మందిరంతో లింకు.. అమిత్ షా ఏం చెప్పారంటే

శుక్రవారం ఈ దాడులు ప్రారంభించినట్లు, గాజా స్ట్రిప్ ప్రాంతంలో ప్రత్యేక ఉద్రిక్త పరిస్థితి ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని హమాస్‌కు చెందిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. నిర్దేశిత లక్ష్యాలపైకి ఇజ్రాయెల్ రాకెట్ లాంఛర్లు ప్రయోగించింది. గాజాలోని ఒక భవనం లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. భవనం ఏడో అంతస్థుపైన రాకెట్లు దాడి చేశాయి. ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు. గాజాలో దాదాపు ఇరవై లక్షల మంది నివసిస్తున్నారు. అయితే, ఇక్కడి తీవ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడుతున్నాయి.

India asks China: రెచ్చగొట్టే చర్యలు ఆపండి.. చైనాకు తేల్చిచెప్పిన భారత్

దీంతో ఇజ్రాయెల్ తరచూ తీవ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది. సరిహద్దుకు 80 కిలోమీటర్ల దూరంలోనే ఈ దాడులు జరిగాయి. ఇక్కడ ముందు జాగ్రత్తగా స్కూళ్లను మూసేసినట్లు అధికారులు తెలిపారు. గాజాకు వెళ్లే దారుల్ని ఇటీవలే ఇజ్రాయెల్ మూసేసింది.

 

ట్రెండింగ్ వార్తలు