Blue Origin: అంతరిక్షంలోకి మరో భారతీయుడు.. ఎవరీ అర్విందర్ సింగ్ బహల్.. ప్రయాణం ఎప్పుడు..

బహల్ ప్రపంచంలోని ప్రతి దేశాన్ని సందర్శించడమే జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ప్రైవేట్ పైలట్ లైసెన్స్, హెలికాప్టర్ శిక్షణ రెండింటినీ కలిగి ఉన్నారు.

Blue Origin: అంతరిక్షంలోకి మరో భారతీయుడు.. ఎవరీ అర్విందర్ సింగ్ బహల్.. ప్రయాణం ఎప్పుడు..

Updated On : August 2, 2025 / 6:59 PM IST

Blue Origin: జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని బ్లూ ఆరిజిన్ తన తాజా సబ్ ఆర్బిటల్ స్పేస్ టూరిజం ఫ్లైట్ NS-34 ను ఆగస్ట్ 3, 2025 ఆదివారం నాడు ప్రారంభించనుంది. ఇందులో వెళ్లే ప్రయాణీకులలో ఆగ్రాలో జన్మించిన అర్విందర్ (అర్వి) సింగ్ బహల్ కూడా ఉన్నారు. నేచురలైజేషన్ ద్వారా US పౌరుడిగా మారిన బహల్ ఒక రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుడు. అడ్వెంచర్స్, గ్లోబల్ ట్రావెల్స్ పట్ల ఆయనకున్న ప్రేమ.. ఉత్తర ధ్రువం నుండి గిజా పిరమిడ్‌ల వరకు తీసుకెళ్లింది. ఇప్పుడు అంతరిక్షం అంచున ఉండబోతున్నారు.

బహల్ ప్రపంచంలోని ప్రతి దేశాన్ని సందర్శించడమే జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ప్రైవేట్ పైలట్ లైసెన్స్, హెలికాప్టర్ శిక్షణ రెండింటినీ కలిగి ఉన్నారు. బ్లూ ఆరిజిన్‌తో తాజా ప్రయాణం.. అన్వేషణ సాహసయాత్రకు అంకితమైన ఆయన జీవితకాలంలో తాజా మైలురాయి.

బహల్ తో పాటు టర్కిష్ వ్యాపారవేత్త జీఖాన్ ఎర్డెమ్, ప్యూర్టో రికన్ వాతావరణ శాస్త్రవేత్త, ఎమ్మీ అవార్డు గెలుచుకున్న జర్నలిస్ట్ డెబోరా మార్టోరెల్, ఇంగ్లీష్ దాతృత్వవేత్త లియోనెల్ పిచ్‌ఫోర్డ్, వ్యవస్థాపకుడు జె.డి.రస్సెల్ (గతంలో NS-28లో ప్రయాణించారు), 2021లో మొదటి న్యూ షెపర్డ్ సీటును గెలుచుకున్న బిడ్డర్ హెచ్.ఇ. జస్టిన్ సన్ కూడా అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.

STEAM రంగాలలోని యువతకు స్ఫూర్తినిస్తూ, తదుపరి తరం అంతరిక్ష అన్వేషకులకు మద్దతిస్తూ, అంతరిక్షంపై దృష్టి సారించిన 19 ఛారిటీల కోసం సన్ 28 మిలియన్ల డాలర్లు వేలం ఇచ్చింది. మోర్టెల్ భూమి వాతావరణాన్ని దాటి వెళ్ళే మొదటి వాతావరణ శాస్త్రవేత్తల్లో ఒకరిగా మారబోతున్నారు. పర్యావరణ అంతరిక్ష అంశాలపై ఆమె నివేదిక బహుళ ఎమ్మీలను గెలుచుకుంది. బ్లూ ఆరిజిన్ krmm లైన్ మీదుగా 70 మందిని తీసుకెళ్లింది.

ఈ ప్రయోగం పశ్చిమ టెక్సాస్‌లోని లాంచ్ సైట్ వన్ నుండి సాయంత్రం 6 గంటలకు(IST) జరుగుతుంది. ఇది లిఫ్ట్ ఆఫ్ అవ్వడానికి 30 నిమిషాల ముందు బ్లూ ఆరిజిన్ వెబ్‌కాస్ట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌ ఆఫర్లు.. అతి తక్కువ ధరకే ఐఫోన్, శాంసంగ్, నథింగ్, మోటో, వివో ఫోన్లు.. డోంట్ మిస్..!