Watch Video: మరో విమానానికి తప్పిన ముప్పు.. రన్‌వే మీద నుంచి స్కిడ్ అయి…

చికాగో నుంచి వచ్చిన జెట్‌బ్లూ విమానం బోస్టన్ లోగాన్ విమానాశ్రయంలో రన్ వేపై నుంచి జారిపోయింది.

Watch Video: మరో విమానానికి తప్పిన ముప్పు.. రన్‌వే మీద నుంచి స్కిడ్ అయి…

JetBlue flight

Updated On : June 13, 2025 / 11:20 AM IST

Ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో 241 మంది మృతిచెందారు. విమానం మెడికోలు ఉంటున్న భవనంపై పడటంతో వారిలో 24మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. ఈ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. పెరుగుతున్న విమాన ప్రయాణ ఆందోళనల మధ్య మరో ప్రమాదం వెలుగులోకి వచ్చింది. అయితే, తృటిలో ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడటంతో విమానయాన అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Also Read: విమానం కూలినదాన్ని బట్టి చూస్తే పైలెట్ ముందు జాగ్రత్తగా ఆ పనిచేసి ఉండొచ్చు.. విమానాన్ని పైకి లేపేందుకు…

చికాగో నుంచి వచ్చిన జెట్ బ్లూ విమానం బోస్టన్ లోగాన్ విమానాశ్రయంలో రన్ వేపై నుంచి జారిపోయింది. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనలో ఎవకీ గాయాలు కాలేదు, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, విమానం రన్ వే నుంచి పక్కకు జారిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నంకు ముందు జరిగింది. చికాగో నుంచి వచ్చిన ఎయిర్‌ బస్ ఏ220-300 జెట్‌బ్లూ ప్లైట్ రన్‌వేపై ల్యాండ్ అయింది. ఈ క్రమంలో విమానం రన్‌వే నుంచి పక్కకు తప్పిపోయింది. వెంటనే విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను దింపేశారు. వారందరినీ సురక్షితంగా సమీపంలోని టెర్మినల్ కు తరలించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు విమానాశ్రయంలో మధ్యాహ్నం 2గంటల వరకు అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కొద్ది గంటల తరువాత మళ్లీ తిరిగి యథావిధిగా విమానాల రాకపోకలు కొనసాగాయి.