Jordan : ఆ రెస్టారెంట్‌లో ‘మన్సాఫ్’ తింటే పడుకునేందుకు బెడ్‌లు ఇస్తారట .. ఇంతకీ మన్సాఫ్ అంటే ఏంటి?

Jordan : ఆ రెస్టారెంట్‌లో ‘మన్సాఫ్’ తింటే పడుకునేందుకు బెడ్‌లు ఇస్తారట .. ఇంతకీ మన్సాఫ్ అంటే ఏంటి?

Jordan

Updated On : July 19, 2023 / 4:51 PM IST

Jordan : సాధారణంగా హెవీగా తింటేనే నిద్ర వస్తుంది. ఎక్కువగా ఫ్యాట్ ఉన్న ఆహారం తింటే నిద్ర ఆపుకోలేం. ఓ రెస్టారెంట్ తమ దేశ జాతీయ వంటకం అయినా ‘మన్సాఫ్’ తిన్న తర్వాత నిద్ర పోయేందుకు సౌకర్యాలు అందిస్తున్నారు.

Healthy Skin : ఆరోగ్యకరమైన చర్మం కోసం బయోటిన్ రిచ్ ఫుడ్స్ ఇవే !

అధికంగా కొవ్వు పదార్ధాలు ఉన్న ఫుడ్ తింటే వెంటనే నిద్ర వస్తుంది. జోర్డాన్ రాజధాని అమ్మన్‌లోని ముయూబ్ రెస్టారెంట్ తమ దేశ జాతీయ వంటకం ‘మన్సాఫ్’ తినే వారికి ఓ స్పెషల్ ఆఫర్ ఇస్తోంది. మన్సాఫ్  చాలామందికి హెవీ ఫుడ్. ఇందులో వాడే పదార్ధాలు అధికంగా కొవ్వును కలిగి ఉంటాయి. ఇది తిన్నాక మన్సాఫ్ లవర్స్‌ నిద్రావస్థలోకి వెళ్లిపోతారు. ఈ డిష్ తిన్న తర్వాత నిద్రవస్తున్నట్లుగా అనిపించి కొందరు కస్టమర్లు బెడ్ కావాలని అడిగారట. అందువల్ల బెడ్స్ తెచ్చి రెస్టారెంట్‌లో సెపరేట్ సెక్షన్ ఏర్పాటు చేశారట. అక్కడ ఎయిర్ కండీషనర్ కూడా ఉంటుందట.

Pork Fat Oil : వామ్మో.. ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? అయితే బీకేర్ ఫుల్, మీ ప్రాణాలకే ప్రమాదం..

మన్సాఫ్ గొర్రె మాంసం, బియ్యం, జామీద్‌తో (నెయ్యి) వండుతారు. ఈ పదార్ధాలు తినడం వల్ల నిద్ర రావడం లేదా అలసటగా అనిపించడం జరుగుతుందట. ఇక జోర్డాన్ దక్షిణ నగరమైన కరక్‌లోని పురాతన మోయాబ్ రాజ్యం పేరు మీద ఈ రెస్టారెంట్ పేరు పెట్టారట. ఈ రెస్టారెంట్ కేవలం మన్సాఫ్‌కి మాత్రమే సేవలు అందిస్తోంది.