Kenyan Govt killed Red Quelea Birds : దేశాన్ని గడగడలాడిస్తున్న బుల్లిపిట్ట .. 6లక్షల పక్షుల్ని చంపటానికి కెన్యా ప్రభుత్వం చర్యలు..
అందాల చిట్టి పిట్టను చంపటానికి ఓ దేశ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 10,20 కాదు 100 లేదా 200లు కాదు ఏకంగా ఎర్రటి ముక్కుతో ముద్దులొలికే 6 లక్షల పక్షుల్ని చంపటానికి చర్యలు తీసుకుంటోంది కెన్యా దేశ ప్రభుత్వం. చూడగానే ముద్దుచ్చేలా ఉండే ఈ చిట్టి పిట్టలు దేశాన్నే గడగడలాడిస్తున్నాయి. అందుకే కెన్యా ప్రభుత్వం ఆ పక్షుల్ని చంపాలని నిర్ణయించింది.

Kenyan Govt killed Red Quelea Birds
Kenyan Govt killed Red Quelea Birds : అందాల చిట్టి పిట్టను చంపటానికి ఓ దేశ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 10,20 కాదు 100 లేదా 200లు కాదు ఏకంగా ఎర్రటి ముక్కుతో ముద్దులొలికే 6 లక్షల పక్షుల్ని చంపటానికి చర్యలు తీసుకుంటోంది కెన్యా దేశ ప్రభుత్వం. చూడగానే ముద్దుచ్చేలా ఉండే ఈ చిట్టి పిట్టలు దేశాన్నే గడగడలాడిస్తున్నాయి. అందుకే కెన్యా ప్రభుత్వం ఆ పక్షుల్ని చంపాలని నిర్ణయించింది. ఇంతకీ ఆ పక్షులు చంపేయాలనేంత పెద్ద నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకుందంటే..ఆఫ్రికా కెన్యా అంటే ఒకప్పుడు కరవు తాండవించి దేశం. ఇప్పుడు కాస్త ఫరవాలేదు. పంటల పండుతున్నాయి.
అటువంటిదేశాన్ని‘క్యులియా’అనే చిన్న సైజులో ఉండే పక్షులు గడగడలాడిస్తున్నాయి. దేశ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. పంటల్ని తినేస్తున్నాయి. పంటలపై పడి యదేశ్చగా తినేస్తున్నాయి. వందలాది టన్నుల ఆహార ధాన్యాలను స్వాహా చేసేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం క్యులియా పక్షుల్ని చంపాలని నిర్ణయించింది. దీని కోసం చర్యలు తీసుకుంటోంది.
ఎర్రటి ముక్కుతో చిన్నగా కనిపించే క్యులియా పక్షు కెన్యా దేశాన్ని హడలెత్తిస్తున్నాయి. నేతలకు, ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అందుకే కెన్యా ప్రభుత్వం క్యులియా పక్షులపై యుద్ధం ప్రకటించింది. లక్షల పక్షులను చంపడానికి చర్యలు ప్రారంభించింది. ఒకప్పుడు కరవుతో బాధపడిన కెన్యా దేశాన్ని ఈ పక్షులు తిరిగి ఆ స్థితికి తీసుకొస్తాయనే భయంతోనూ..ఆందోళనతో ఇటువంటి నిర్ణయం తీసుకుంది.
కెన్యాలో లక్షలాదిగా ఉన్న ఈ పక్షులు వందలాది టన్నుల ఆహార ధాన్యాలను ఆహారంగా ఆరగిస్తూ అటు రైతులను, ఇటు ప్రభుత్వానికి హడలెత్తిస్తున్నాయి. పంటలు వేసిన రైతులు కాపాలాగా ఉండి రాత్రి పగళ్లు కాపలా కాసినా ఫలితం ఉండటంలేదు. నిద్రలేకుండా రైతులు 24గంటలు కాపాలా కాస్తున్నా క్యులియా పక్షుల బెడదనుంచి తప్పించుకోలేకపోతున్నారు. గోధుమ, బార్లీ, రైస్, సన్‌ఫ్లవర్ పంటలపై పడి నాశనం చేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు.దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. మరోసారి కరవు కోరల్లో దేశం చిక్కుకోకూదనే యోచనతో ముద్దులొలికే పక్షుల్ని చంపటానికి చర్యలు తీసుకుంటోంది.