కిమ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది…ప్రకటించిన దక్షిణకొరియా

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2020 / 07:07 AM IST
కిమ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది…ప్రకటించిన దక్షిణకొరియా

Updated On : April 21, 2020 / 7:07 AM IST

ఉత్తరకొరియా అధినేత ఆరోగ్యం విషమించిందంటూ అంతర్జాతీయ మీడియా నుంచి నాలుగైదు రోజులు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గుండె సంబంధిత వ్యాధితో కిమ్ బాధపడుతున్నారని, ఆయన ప్రస్తుతం కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చసాగింది. గుండె సంబంధిత అనారోగ్యం కారణంగా కిమ్ కు శస్త్రచికిత్స కూడా నిర్వహించారని, దాని తరువాత కిమ్‌ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపించాయి.

 కాగా,ఏప్రిల్-15న ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే ముఖ్యమైన తన తాత,ఉత్తర కొరియా జాతిపిత కిమ్ ఇల్ సంగ్  జయంతి ఉత్సవాలకు కూడా కిమ్ జోంగ్ ఉన్‌ హాజరుకాకపోవడంతో ఈ వార్తలు నిజమేనని భావిస్తున్న సమయంలో… ఏప్రిల్ మొదట్లో జరిపిన ఓ సర్జరీ తర్వాత..కిమ్ కు ట్రీట్మెంట్ కొనసాగుతున్నట్లు దక్షిణ కొరియా మీడియా సోమవారం రాత్రి రిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమంగా లేదని మంగళవారం(ఏప్రిల్-21,2020) ఉత్తరకొరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజం కాదని ఇద్దరు దక్షిణ కొరియా ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. కిమ్ ఆరోగ్యం గురించి ఉత్తరకొరియా నుంచి ఎటువంటి అసాధారణ సంకేతాలు లేవని దక్షిణకొరియా తెలిపింది.

ఏప్రిల్-12 తర్వాత హృదయ సంబంధిత ఆపరేషన్ తర్వాత మౌంట్ కుమాంగ్ రిసార్ట్ లోని ఓ విల్లాలో కిమ్ ఉన్నారని,ఆయన కోలుకుంటున్నారని సియోల్ ప్రధానకేంద్రంగా పనిచేసే ఓ స్పెషాలిటీ వెబ్ సైట్ డైలీ NK  తెలిపింది. ఏప్రిల్-12న కిమ్ జోంగ్ ఉన్ ఓ ఎయిర్ బేస్ ను సందర్శించారని,ఫైటర్ జెట్ లు మరియు ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్ డ్రిల్స్ ను ఆయన వీక్షించారని ఉత్తరకొరియా మీడియా ఏప్రిల్-12న రిపోర్ట్ చేసిన విసయం తెలిసిందే.అయితే అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఉత్తర కొరియా నుంచి ఎలాంటి ప్రకటనా ఇప్పటివరకు వెలువడలేదు.