Teacher poisoning 25 childrens : 25 మంది పిల్లలకు విషమిచ్చిన టీచర్‌కు మరణశిక్ష
39 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలి కోర్టు మరణశిక్ష విధించిది. 25మంది విద్యార్దులకు విషం పెట్టినందుకు కోర్టు మరణశిక్ష విధించి అమలు చేసింది.

Kindergarten teacher ..poisoning 25 children
Kindergarten teacher ..poisoning 25 children : చైనా(China)లో 25మంది పిల్లలకు (poisoning 25 students) విషం ఇచ్చినందుకు ఓ ఉపాధ్యాయురాలికి కోర్టు ఉరి శిక్ష విధించింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ దారుణ ఘటలో సదరు ఉపాధ్యాయురాలికి కోర్టు ఉరి శిక్ష విధించి దాన్ని అమలు చేసింది. తోటి టీచర్ తో గొడవ పెట్టుకుని పిల్లలు తినే ఆహారంలో ఓ కిండర్‌గార్టెన్ టీచర్ (Kindergarten teacher)కొన్ని రసాయనాలు (Chemicals)కలిపింది. దీంతో మధ్యాహ్నాం భోజనాలు చేసిన తరువాత విద్యార్ధులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. అలా మొత్తం 25మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఓ విద్యార్ది ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి పాల్పడిన టీచర్ కు హెనన్ ప్రావిన్స్ జియావోజువో నగరంలోని నం.1 ఇంటర్మీడియట్ కోర్టు శుక్రవారం (జులై 14,2023) మరణశిక్ష విధించింది దాన్ని అమలు పరిచింది.
Viral Video : హైటెక్ బిచ్చగాడు.. విమానంలో భిక్షాటన చేసిన వ్యక్తి వీడియో వైరల్
జియావోజువోలోని మెంగ్‌మెంగ్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కు చెందని స్కూల్లో వాంగ్ యున్ అనే 39 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు తోటి ఉపాధ్యాయురాలికి ఓ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో వాంగ్ యున్ 2019 మార్చి 27న పిల్లలు తినే ఆహారంలో కొన్ని రకాల రసాయినాలు కలిపింది. అది తెలియక ఆహారం తిన్న విద్యార్దులంతా తీవ్ర అస్వస్థకు గురి అయి ఆస్పత్రి పాలయ్యారు. చైనాలో బాగా ప్రాచుర్యం పొందిన ఓ రకమైన జావ తీపిగల రుచితో పిల్లలు ఇష్టంగా తినేలా ఉంటుంది. ఆ జావలో వాంగ్ సోడియం నైట్రేట్ తో పాటు కొన్ని రసాయినాలు కలిపింది. అది విషపదార్ధంగా మారటంతో ఆ జావ తిన్న పిల్లలంతా అస్వస్థకు గురి అయ్యారు. అలా ఆస్పత్రి పాలైన విద్యార్ధులు కోలుకున్నారు. కానీ వారిలో ఒక విద్యార్ది 10 నెలల చికిత్స తరువాత అనంతరం మృతిచెందగా.. వాంగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది.
విద్యార్ధులు అస్వస్థకు గురి అయిన సందర్భంలో స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఆస్పత్రికి తరలించి..పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడ జరిగిన గొడవ గురించి తెలుసుకుని అనుమానితురాలి వాంగ్ ను అరెస్ట్ చేశారు. అనంతరం విచారించగా నిజాన్నీ అంగీకరించింది. ఈక్రమంలో నాలుగేళ్లుగా విచారణ జరగటం..10 నెలల క్రితం విద్యార్ది చనిపోవటంతో వాంగ్ కు కోర్టు మరణశిక్ష విధించి అమలు చేసింది.
Guatemala : అగ్నిపర్వతంపై పిజ్జా వండుకుని తిన్న మహిళ