sri lanka crisis: కలిసి పనిచేద్దాం రండి.. ప్రతిపక్ష పార్టీలను కోరిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స

కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం సిద్ధమైంది. కలిసి పనిచేద్దాం రండి అంటూ ప్రతిపక్ష పార్టీలను శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోమవారం కోరారు.

sri lanka crisis : శ్రీలంకను ఆర్థిక, ఆహార సంక్షోభం వెంటాడుతోంది. ఆ దేశ ప్రభుత్వంపై పజాగ్రహం పెల్లిబికుతోంది. ప్రజలంతా రోడ్లపైకొచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్, కూరగాయల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దేశంలో ప్రజల నిరసనను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించినప్పటికి ప్రజలు లెక్కచేయకుండా రోడ్లపైకొచ్చి నిరసన, ధర్నాలు చేపడుతున్నారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత శ్రీలంక కేబినెట్లో 26 మంది మంత్రులు రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ప్రధాని మహింద్ర రాజపక్స కు అందజేశారు.

Sri Lanka Crisis : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఎఫెక్ట్.. 26 మంది మంత్రుల రాజీనామా ..

మంత్రుల రాజీనామా శ్రీలంక స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. స్టాక్ ఎక్సేంజ్ కుప్పకూలింది. ట్రేడింగ్ మొదలైన క్షణాల్లోనే బ్లూ చిప్ సూచి 5.92 శాతం కుంగింది. దీంతో ట్రేడింగ్ ను నిలిపివేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కలిసి పనిచేద్దాం రండి అంటూ ప్రతిపక్ష పార్టీలను శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోమవారం కోరారు. కేబినెట్ లో చేరి పదవులు చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలకు లేఖలు రాశారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసం, భావి తరాల అభ్యున్నతికోసం ప్రభుత్వంతో కలిసేందుకు ముందుకు రావాలంటూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పేర్కొన్నారు.

Sri lanka crisis : ఆకలితో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు..కిలో బియ్యం రూ.220, పాలపొడి రూ.1900లు

అర్థరాత్రి సమయంలో 26 మంది మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అదేబాటలో శ్రీలంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివర్ధ్ కాబ్రాల్ చేరారు. కేబినెట్ మంత్రులందరూ రాజీనామా చేసిన నేపథ్యంలో తానుకూడా గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు