LinkedIn: ‘లింకిడ్ఇన్ 700 మిలియన్ యూజర్ల డేటా బ్రీచింగ్ జరగలేదు’

ప్రముఖ మాధ్యమం లింకిడ్ఇన్ లో యూజర్లుగా ఉన్న 700 మిలియన్ మంది డేటా పోయిందనడంలో వాస్తవం లేదు. 756మిలియన్ మందిలో 92శాతం మంది...

LinkedIn: ‘లింకిడ్ఇన్ 700 మిలియన్ యూజర్ల డేటా బ్రీచింగ్ జరగలేదు’

Linkedin

Updated On : June 30, 2021 / 9:03 PM IST

LinkedIn: ప్రముఖ మాధ్యమం లింకిడ్ఇన్ లో యూజర్లుగా ఉన్న 700 మిలియన్ మంది డేటా పోయిందనడంలో వాస్తవం లేదు. 756మిలియన్ మందిలో 92శాతం మంది డేటా దొంగతనం జరగడమనేది మామూలు విషయం కాదని ప్రైవేట్ లింకిడ్ఇన్ సభ్యుడు ఒకరు అన్నారు.

మా ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో.. లింకిడ్ఇన్ తో పాటు ఇతర వెబ్ సైట్లలో ఏప్రిల్ 2021 వరకూ ఒకే డేటా ఇచ్చిన వారి వివరాలు మాత్రమే అప్‌డేట్ అయ్యాయని కంపెనీ స్టేట్మెంట్ లో పేర్కొంది.

ఈ వారం ఆరంభంలో హ్యాకర్ ఫారం.. 700మిలియన్ మంది డేటా తమ దగ్గర ఉందని అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటించింది. ప్రూఫ్ చూస్కోమంటూ మిలియన్ మంది డేటాను శాంపుల్ గా చూపించింది. ఆ డేటాలో ఈమెయిల్ అడ్రస్‌లు, పూర్తి పేర్లు, ఫోన్ నెంబర్లు, ఫిజికల్ అడ్రస్ లు, జియోలొకేషన్లు, లింకిడ్ఇన్ యూజర్ నేమ్, ప్రొఫైల్ యూఆర్ఎల్, పర్సనల్.. ప్రొఫెషనల్ బ్యాక్ గ్రౌండ్, జెండర్స్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ ఉన్నాయి.

రిస్టోర్ ప్రైవసీ విశ్లేషణ ప్రకారం.. 2020 నుంచి 2021వరకూ కొంతమంది యూజర్లు టెలిగ్రామ్ నుంచి కూడా కనెక్ట్ అవుతున్నారు. ఆ డేటాతో ఫిషింగ్ అటెంప్ట్స్ కు, సోషల్ ఇంజినీరింగ్ అటాక్ ల కోసం యాక్సెస్ చేయడానికి వీలుంటుంది.

లింకిడ్ఇన్ పై నమ్మకంతో ఉన్న సభ్యుల డేటా తప్పుడు పనిచేయడానికి వినియోగించం. అలా చేయడానికి ప్రయత్నించినా.. కంపెనీ నిబంధనల ప్రకారం.. లింకిడ్ఇన్ దానికి ఒప్పుకోదు. వాటిని అడ్డుకుని సరైన బుద్ధి చెప్తాం అని లింకిడ్ఇన్ చెప్పింది.