Lionel Messi Retirement : ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత మెస్సీ రిటైర్మెంట్..! తీవ్ర నిరాశలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్..!!
మెస్సీ.. ఈ రెండక్షరాలు వింటే చాలు ఫుట్ బాల్ ప్రపంచం మొత్తం ఊగిపోతుంది. అతను గ్రౌండ్‌లోకి దిగితే చాలు.. స్టేడియాలకే పూనకాలు వచ్చేస్తాయ్. మెస్సీ ఆడుతున్నాడంటే.. ఫ్యాన్స్‌లో తెలియకుండానే వైబ్రేషన్ మొదలైపోతుంది. అతను గట్టిగా ఓ కిక్ ఇచ్చి గోల్ కొడితే.. అర్జెంటీనాతో పాటు ఆలోవర్ వరల్డ్‌లో ఉన్న అతని ఫ్యాన్స్ సెలబ్రేషన్‌లో మునిగిపోతారు. అలాంటి.. స్టార్ ప్లేయర్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కి గుడ్‌బై చెప్పబోతున్నాడు.

Lionel Messi Retirement
Lionel Messi Retirement : మెస్సీ.. ఈ రెండక్షరాలు వింటే చాలు ఫుట్ బాల్ ప్రపంచం మొత్తం ఊగిపోతుంది. అతను గ్రౌండ్‌లోకి దిగితే చాలు.. స్టేడియాలకే పూనకాలు వచ్చేస్తాయ్. మెస్సీ ఆడుతున్నాడంటే.. ఫ్యాన్స్‌లో తెలియకుండానే వైబ్రేషన్ మొదలైపోతుంది. అతను గట్టిగా ఓ కిక్ ఇచ్చి గోల్ కొడితే.. అర్జెంటీనాతో పాటు ఆలోవర్ వరల్డ్‌లో ఉన్న అతని ఫ్యాన్స్ సెలబ్రేషన్‌లో మునిగిపోతారు. అలాంటి.. స్టార్ ప్లేయర్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కి గుడ్‌బై చెప్పబోతున్నాడు. మెస్సీ అంటే ఓ క్రేజ్..ఓఎమోషన్..ఓ చరిత్ర. లియో అంటే మామూలు స్పెషల్ కాదు. ఫుట్‌బాల్ గేమ్‌నే మైమరిపించేంత స్పెషల్. ఎందుకంటే.. అతను లియోనెల్ మెస్సీ. లియోనెల్ అంటే.. యంగ్ లయన్ అని అర్థం. వయసులో ఉన్న సింహం పంజా విసిరితే.. ఆ వెయిట్ ఎలా ఉంటుందో.. మెస్సీ కిక్ కూడా అలాగే ఉంటుంది. అతను గోల్ కొడితే.. అర్జెంటీనా ఫ్యాన్స్‌కి, ఫుట్‌బాల్ లవర్స్‌కి.. అంతకుమించిన కిక్ వస్తుంది.
ఫుట్‌బాల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే.. మారడోనా వారసుడిగా పేరు సంపాదించాడు మెస్సీ. పేరొక్కటే కాదు.. గేమ్‌లో మారడోనాకు తానేమీ తక్కువ కాదని నిరూపించే స్థాయికి ఎదిగాడు. మెస్సీ అంటే ఫుట్‌బాల్ ప్లేయర్ మాత్రమే కాదు.. ఆ గేమ్ లవర్స్‌కి ఒక ఎమోషన్. అతను ఆ దేశం తరఫున ఆడుతున్నాడు? ఎవరి కోసం ఆడుతున్నాడనే లెక్కలేవీ లేకుండా.. అతని ఆటను ఆస్వాదించే వాళ్లు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అందుకు.. ఇండియన్స్‌ని మించిన బిగ్ ఎగ్జాంపుల్ మరొకటి లేదు. నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో.. ఇండియన్ ఫుట్‌బాల్ లవర్స్ సపోర్ట్ అంతా అర్జెంటీనా టీమ్‌కే ఉంటుంది. ఇదో.. సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే.. ఇదంతా అర్జెంటీనా మీద ఉన్న ప్రేమ కాదు. అందుకున్న ఒకే ఒక్క రీజన్ మెస్సీ.
ఒక అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్‌కు.. అర్జెంటీనాలో విపరీతమైన క్రేజ్ ఉండటంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. కానీ.. మెస్సీ అలా కాదు. అర్జెంటీనా అవతల కూడా మెస్సీకి ఉన్న క్రేజ్.. మరే ఫుట్ బాల్ ప్లేయర్‌కి లేదు. ఇండియాలోనూ మెస్సీని అభిమానించే వాళ్లు, ప్రేమించే వాళ్లు తక్కువ సంఖ్యలో ఏమీ లేరు. ఈ మైండ్ బ్లాంక్ చేసే క్రేజ్‌కి కారణం.. అతని ఆట తీరే. అతను గ్రౌండ్‌లో చిరుతలా పరిగెత్తకపోయినా.. గోల్స్ వేట మాత్రం అంతకుమించి ఉంటుంది. మెస్సీని చూసేందుకు.. మెస్సీ ఆటను లైవ్‌లో వీక్షించేందుకు ఖతార్‌కు వచ్చిన ఆడియెన్స్ కూడా లక్షల్లో ఉంటారు. అంతెందుకు.. మన ఇండియన్ ఫుట్ బాల్ ఫ్యాన్స్ కూడా ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను చూసేందుకు ఖాతార్ దాకా వెళ్లిపోయారు. కేరళతో పాటు మిగతా ప్రాంతాల్లో ఉన్న ఫుట్ బాల్ ప్రేమికులు, మెస్సీ ఫ్యాన్స్.. అర్జెంటీనా మ్యాచ్‌లు చూసేందుకు.. వేలాదికి తరలివెళ్లారు.
Lionel Messi : లియోనల్ మెస్సీ వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగిన వెనుకున్న కారణాలు..
2005లో అర్జెంటీనా తరపున ఎంట్రీ ఇచ్చిన మెస్సీ.. జస్ట్ 17 ఏళ్లకే తన పెర్ఫార్మెన్స్‌తో అందరి మైండ్ బ్లో చేశాడు. ఈ ఫుట్‌బాల్ సూపర్ స్టార్.. ఇప్పటివరకు అర్జెంటీనా తరపున 96 గోల్స్ చేశాడు. లియోనల్ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ రికార్డ్స్ కూడా మామూలుగా లేవు. మెస్సీ 25 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో.. 19 గోల్స్, అసిస్ట్స్ చేశాడు. 10 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో.. అర్జెంటీనా తరఫున మొత్తం 11 గోల్స్ కొట్టాడు మెస్సీ. ఈ దేశానికే.. టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రపంచకప్‌లో ఐదు గోల్స్ చేసిన అత్యధిక వయసున్న ఆటగాడు మెస్సీనే. నాలుగు వరల్డ్ కప్ టోర్నీల్లో గోల్స్ చేయడంతో పాటు గోల్స్‌కు సహకరించిన ఏకైక ఆటగాడు మెస్సీ. ఫిఫాలో అత్యధికంగా గోల్స్, అసిస్ట్స్ చేసిన రికార్డును సమం చేసిన మూడో ఆటగాడు మెస్సీ. ఇక.. 20 ఏళ్ల వయసులో, 30 ఏళ్ల పడిలో ప్రపంచకప్ గోల్స్ చేసిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ లియోనే. అంతేకాదు.. వరల్డ్‌కప్‌లోని మూడు నాకౌట్ దశల్లో గోల్స్ చేసిన ఏకైక అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ. ప్రపంచకప్‌లో 25 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడు కూడా మెస్సీనే. ఈ ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో.. ఇప్పటివరకు 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఇదో.. రేర్ రికార్డ్. క్రొయేషియాతో జరిగిన సెమీస్‌తో.. అతను కెప్టెన్‌గా ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు.
మెస్సీ కెరీర్‌లో ఎన్నో టైటిల్స్, రికార్డ్స్, అవార్డ్స్ ఉన్నా.. ఫిఫా వరల్డ్ కప్ మాత్రం అందని ద్రాక్షలాగే ఉంది. 2014లో టైటిల్ గెలిచే చాన్స్ వచ్చినా.. ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోయింది. దీంతో.. మెస్సీ ఫిఫా కప్ డ్రీమ్.. కలగానే మిగిలిపోయింది. ఈసారి ఫైనల్స్‌లో విక్టరీ కొట్టి.. అర్జెంటీనా మూడున్నర దశాబ్దాల వరల్డ్‌కప్ టైటిల్ నిరీక్షణకు ఎండ్ కార్డ్ వేయడంతో పాటు తన ఫిఫా టైటిల్ కలను కూడా నిజం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాతే.. ఇంటర్నేషనల్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాలని ఫిక్స్ అయ్యాడు ఈ అర్జెంటీనా సూపర్ స్టార్ ప్లేయర్. అర్జెంటీనా తరపున.. తన చివరి మ్యాచ్‌లో గెలిచి టీమ్‌ని.. వరల్డ్ ఛాంపియన్‌గా నిలపాలని మెస్సీ భావిస్తున్నాడు. 1986లో అర్జెంటీనా చివరిసారిగా వరల్డ్‌కప్ గెలిచింది. ఈ వరల్డ్‌కప్ మెగా టోర్నీలో.. 36 ఏళ్ల అర్జెంటీనా నిరీక్షణకు తెరపడుతుందని అంతా అంచనా వేస్తున్నారు.