London Man : నిలబడి కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు

క‌నీసం 8 గంట‌లు పని చేయడంతో 16వేల రూపాయల వ‌ర‌కు వస్తున్నాయి. ఎక్కువ‌గా ఏవైనా ఈవెంట్స్ కోసం టికెట్లు తీసుకోవ‌డానికి వ‌చ్చేవాళ్లు త‌న‌కు ఎక్కువ మొత్తంలో డ‌బ్బులు ఇచ్చి...

London Man : నిలబడి కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు

Standing Line

London Man Makes Money Just By Standing : ఓ వ్యక్తి లైన్‌లో నిల‌బ‌డి రోజుకు 16 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. అదేలా ? లైన్ లో నిలబడితే ఎలా డబ్బులు వస్తాయి ? అంటారు కదా. మనం సినిమాకు లేదా మాల్స్..ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో అక్కడ చాంతాండంత క్యూ ఉంటుంది. లైన్ లో నిలబడలేక సతమతమౌతుంటాయి. అలాంటి వారికి హెల్ప్ చేస్తానంటాడు. వారికి బదులు ఇతను క్యూ లైన్ లో నిలబడుతాడు. ఇందుకు కొంత డబ్బులు వసూలు చేస్తున్నాడు. క్యూలో నిల్చొనే రెండు చేతులా డబ్బు రాబడుతున్నాడు.

Read More : 1984 Spider Man Comic : స్పైడర్ మ్యాన్ పుస్తకంలో ఒకే ఒక్క పేజీ ధర రూ.24 కోట్లు..!!

ఇతడి పేరు ఫ్రెడ్డీ బెకిట్‌. లండ‌న్‌కు చెందిన బెకిట్‌ను అంద‌రూ ప్రొఫెష‌న‌ల్ క్యూయ‌ర్ అంటారు. ధ‌న‌వంతుల కోసం అత‌డు లైన్‌లో నిలుచుంటాడు. సినిమా హాల్స్‌, మాల్స్, వైన్ షాపుల ముందు, మ్యూజియం, సూప‌ర్ మార్కెట్స్‌, స్టోర్స్ ముందు ఎక్కడ క్యూ ఉన్నా.. అక్కడ బెకిట్ ప్రత్యక్షం అవుతాడు. లైన్‌లో నిల‌బ‌డ‌లేని వాళ్ల కోసం లైన్‌లో నిల‌బ‌డి డ‌బ్బు సంపాదిస్తాడు.

Read More : Secunderabad Club : క్లబ్ సభ్యుల డేటా సేఫ్…ఎప్పుడు తెరుస్తామో చెబుతాం

గ‌డ్డ క‌ట్టే చ‌లిలో, ఎండ‌లో నిల‌బ‌డ‌లేని వాళ్ల కోసం బెకిట్ ఈ ప‌ని చేస్తాడు. అలా వాళ్ల కోసం లైన్‌లో నిల‌బ‌డినందుకు గంట‌కు రెండు వేల రూపాయలు ఇస్తారు. దీంతో అతడు రోజుకు క‌నీసం 8 గంట‌లు పని చేయడంతో 16వేల రూపాయల వ‌ర‌కు వస్తున్నాయి. ఎక్కువ‌గా ఏవైనా ఈవెంట్స్ కోసం టికెట్లు తీసుకోవ‌డానికి వ‌చ్చేవాళ్లు త‌న‌కు ఎక్కువ మొత్తంలో డ‌బ్బులు ఇచ్చి క్యూలో నిలుచోబెడతారని అతడు తెలిపాడు. అయితే.. లండ‌న్‌లో ఇలాంటి ప్రొఫెష‌న‌ర్ క్యూయ‌ర్స్ చాలామందే ఉన్నారు. ఎక్కువ లైన్ ఉన్నప్పుడు అంత పెద్ద లైన్‌లో నిల‌బ‌డ‌లేక చాలామంది ఇలాంటి ప్రొఫెష‌న‌ర్ క్యూయ‌ర్స్‌ను ఉప‌యోగించుకుంటారు.