Londons Luton Airport : లండన్ లూటన్ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం…విమానాల రాకపోకల రద్దు
లండన్ నగరంలోని లూటన్ విమానాశ్రయంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. లూటన్ విమానాశ్రయంలోని కారు పార్కింగ్ ఏరియాలో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది.....

Londons Luton Airport
Londons Luton Airport : లండన్ నగరంలోని లూటన్ విమానాశ్రయంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. లూటన్ విమానాశ్రయంలోని కారు పార్కింగ్ ఏరియాలో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా పార్కింగ్ పై కప్పు పాక్షికంగా కూలిపోయింది. దీంతో లూటన్ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను నిలిపివేశామని విమానాశ్రయం అధికారులు చెప్పారు. విమాన ప్రయాణికులు అగ్నిప్రమాదం జరిగిన పార్కింగ్ స్థలం వైపు వెళ్లవద్దని కోరారు.
Also Read :Earthquake : అప్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ భూకంపం
విమాన ప్రయాణికుల భద్రత దృష్ట్యా బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు విమానాల రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు విమానాశ్రయం అధికారులు చెప్పారు. ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ సిబ్బంది మంటలను ఆర్పడానికి, విమానాశ్రయంలోని ఇతర భవనాలు, వాహనాలకు మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి కృషి చేస్తున్నారు. సగం భవనం పూర్తిగా అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. ఈ అగ్నిప్రమాదం వల్ల స్థానిక నివాసితులు కిటికీలు , తలుపులు మూసివేయాలని అధికారులు సూచించారు.