ఇది ఆటో కాదండీ బాబు.. హ్యాండ్ బ్యాగ్.. ధర రూ.35 లక్షలు.. వీడియో చూస్తే ఆశ్చర్యచకితులవుతారు.. 

దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. “మిడిల్ క్లాస్ కష్టాలు ఇప్పుడు హై క్లాస్ ఫ్యాషన్ అయ్యాయి" అని కామెంట్ చేశారు. 

ఇది ఆటో కాదండీ బాబు.. హ్యాండ్ బ్యాగ్.. ధర రూ.35 లక్షలు.. వీడియో చూస్తే ఆశ్చర్యచకితులవుతారు.. 

Updated On : July 7, 2025 / 10:37 AM IST

ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ “లూయిస్ విట్టన్” సరికొత్త స్టైల్‌లో హ్యాండ్‌బ్యాగ్‌ను తయారుచేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారతీయ ఆటోరిక్షా ఆకారంలో హ్యాండ్‌బ్యాగ్‌ను తయారు చేసి, ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఇది ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Men’s Spring/Summer 2026 కలెక్షన్‌లో భాగంగా దీన్ని విడుదల చేసింది. భారతీయ సంస్కృతిని స్ఫూర్తిగా తీసుకుంటూ.. స్థానిక సంప్రదాయ హస్తకళలను హైలైట్ చేస్తూ, స్ట్రీట్ ఫ్యాషన్‌కు మోడ్రన్ స్టైల్‌ను జతచేస్తూ దీన్ని రూపొందించింది. ఈ ఆటోరిక్షా బ్యాగ్‌ వినూత్న రీతి ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

లూయిస్ విట్టన్ సిగ్నేచర్ మోనోగ్రామ్ కాన్వాస్‌తో తయారు చేసిన ఈ బ్యాగ్‌కు చిన్నచిన్న చక్రాలు, తెలుపు రంగు లెదర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ‘Diet Paratha’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ బ్యాగ్‌కు సంబంధించిన వీడియో కనపడింది. దీని ధర దాదాపు రూ.35 లక్షలు ఉంటుంది.

ఈ వీడియోను అందులో పోస్ట్ చేస్తూ ఈ బ్యాగ్ వలసరాజ్య చరిత్రను గుర్తు చేస్తోందని సరదాగా పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, లగ్జరీని మిక్స్‌ చేస్తూ ఉన్న ఈ బ్యాగ్‌ను ప్రవాస భారతీయులు బాగా ఇష్టపడతారని అన్నారు.

దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. “మిడిల్ క్లాస్ కష్టాలు ఇప్పుడు హై క్లాస్ ఫ్యాషన్ అయ్యాయి” అని కామెంట్ చేశారు. లూయిస్ విట్టన్ వినూత్న డిజైన్లతో ఇటువంటివి రూపొందిస్తుంది. గతంలో విమానం, డాల్ఫిన్, లాబ్స్టర్ ఆకారంలో బ్యాగ్స్ రూపొందించారు.

 

View this post on Instagram

 

A post shared by Diet Paratha (@diet_paratha)