కరోనా చికిత్సకు చౌకైన మరో యాంటీవైరల్ డ్రగ్.. ధర ఎంతంటే?

కరోనా చికిత్స కోసం యాంటీవైరల్ డ్రగ్ Favipiravir వెర్షన్ వచ్చేసింది. ఈ డ్రగ్‌ను ప్రముఖ ఫార్మా సంస్థ Lupin సంస్థ లాంచ్ చేసింది. కోవిడ్ నివారణకు ప్రయోగాత్మక డ్రగ్ చెబుతున్న Favipiravir ఔషధాన్ని చౌకైన ధరకే అందిచనుంది. Covihalt పేరుతో ఈ డ్రగ్ పేరుతో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది.
భారతదేశంలో తన ఫావిపిరవిర్ ఔషధాన్ని Covihalt బ్రాండ్ పేరుతో తీసుకొచ్చింది. తేలికపాటి నుండి మోడరేట్ లక్షణాలున్న కోవిడ్ -19 చికిత్స కోసం ఈ డ్రగ్ తీసుకొచ్చినట్టు ప్రకటించింది. అత్యవసర ఉపయోగం కోసం ఫావిపిరవిర్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)నుంచి ఆమోదం కూడా పొందినట్టు కంపెనీ తెలిపింది.
సిప్లా లిమిటెడ్, సన్ ఫార్మా, హెటెరో ల్యాబ్స్‌తో సహా జనరిక్ ఔషధ కంపెనీ Favipiravirను అభివృద్ధి చేస్తోంది. లుపిన్ వెర్షన్, కోవిహాల్ట్ 10 టాబ్లెట్ల స్ట్రిప్ రూపంలో 200 మిల్లీగ్రాముల టాబ్లెట్లుగా లభిస్తుందని అంటోంది.. టాబ్లెట్‌కు రూ .49 ధర ఉంటుందని కంపెనీ తెలిపింది.
సన్ ఫార్మా మంగళవారం తన సొంత వెర్షన్‌ను రూ .35 లకే విడుదల చేసింది, ఇప్పటివరకు భారతదేశంలో చౌకైన యాంటీ వైరల్ డ్రగ్ ఇదే… బుధవారం మధ్యాహ్నం 12:35 గంటలకు స్టాక్ 0.03 శాతం స్వల్పంగా పెరగడంతో లుపిన్ షేర్లు స్వల్ప లభాలను ఆర్జించాయి. ఫావిపిరవిర్‌ను తొలుత జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ హోల్డింగ్స్ అవిగన్ బ్రాండ్ పేరుతో అభివృద్ధి చేసింది.