Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం…దీని ప్రభావం ఎంతంటే ?
ఇండోనేషియా దేశంలో గురువారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని తైమూర్ నగరంలో గురువారం సంభవించిన భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో నమోదైంది....

Earthquake
Earthquake : ఇండోనేషియా దేశంలో గురువారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని తైమూర్ నగరంలో గురువారం సంభవించిన భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో నమోదైంది. ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లో గురువారం తెల్లవారుజామున 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. 15 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్ రాజధాని కుపాంగ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Also Read : YS Sharmila Ready To Contest from Paleru : పాలేరు నుంచి పోటీకి వైఎస్ షర్మిల రెడీ
భూమి కంపిస్తున్నపుడు ఇళ్లలో నుంచి ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ముప్పు లేదని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ అంచనా వేసింది. ఇండోనేషియాలో ఈ భూకంపం వల్ల తక్షణం ఆస్తి నష్టం గురించి సమాచారం అందలేదు. పలు నగరాల్లో భారీ భూకంపం వల్ల ఇళ్లు కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Also Read : Konda Vishweshwar Reddy : బీజేపీకి మరో బిగ్ షాక్? వివేక్ దారిలో మరో కీలక నేత?
భూకంపం సంభవించినప్పుడు కుపాంగ్‌లోని ఆస్టన్ హోటల్‌లోని హోటల్ అతిథులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని హోటల్ ఉద్యోగి శామ్యూల్ మలోహనా తెలిపారు. వంద మంది అతిథులు తమ గదులను విడిచిపెట్టి హోటల్ ముందు గుమిగూడారు. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని భూకంపం, సునామీ కేంద్రం అధిపతి డార్యోనో చెప్పారు.