Earthquake: పసిఫిక్ ద్వీప దేశాన్ని కుదిపేసిన భారీ భూకంపం.. వీడియోలు వైరల్

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. యూఎస్జీఎస్ తెలిపిన వివరాల ప్రకారం..

Earthquake: పసిఫిక్ ద్వీప దేశాన్ని కుదిపేసిన భారీ భూకంపం.. వీడియోలు వైరల్

Vanuatu Earthquake

Updated On : December 17, 2024 / 9:33 AM IST

Vanuatu Earthquake: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. యూఎస్జీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. భూకంపం 57కిలో మీటర్లు లోతులో సంభవించింది. ద్వీప దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 30 కిలో మీటర్లు కేంద్రీకృతమైంది. అదే ప్రదేశానికి సమీపంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోవైపు.. భారీ భూకంపం కారణంగా స్థానికంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్ అమెరికా వెళ్లనున్న కేసీఆర్.. రెండు నెలలు అక్కడే ఉండేందుకు ప్లాన్

భూకంపం సంభవించిన ప్రాంతంలో ప్రాథమిక సమాచారం మేరకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో దృశ్యాల ప్రకారం.. భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారీ అలలు పోర్టు విలాకు చేరుకున్నాయి. వనౌటులో కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు వీడియోల్లో చూడొచ్చు. ఈ క్రమంలో స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.