సెక్స్ సామర్థ్యం పెరగడానికి పురుషులు తప్పక తినాల్సినవి

ఖాళీ టైం దొరికితే.. పార్టనర్‌తో టైం ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు. కానీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి సెక్స్ లైఫ్ అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నామంటూ కెమికల్స్ కలిపిన మందులు వాడుతూ ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి తాత్కాలికంగా పనిచేస్తాయి కానీ, ఆ తర్వాత వచ్చే దుష్ఫలితాల గురించి పట్టించుకోవడం లేదు. అలా కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మఖానా తీసుకుంటే భవిష్యత్‌లోనూ అదే సామర్థ్యాన్ని కొనసాగించొచ్చు.
మఖానా(తామర గింజలు) మగాళ్లలో సామర్థ్యాన్ని బాగా పెంచుతాయి. ఇవి చాలా రీసెర్చ్‌లలో వెల్లడైంది. మగాళ్లలో పటుత్వం, త్వరగా స్కలనమైపోవం, వీర్య కణాలు తక్కువ కావడం వంటి సమస్యలను అధిగమించవచ్చు.
ఇవి కేవలం సెక్స్ లైఫ్ కు మాత్రమే కాదు. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తాయి. ఆరంభంలో 6నుంచి 7మఖానా వేడి పాలతో పాటు తింటే మత్తు నిద్రలోకి వెళ్లిపోతారు.
ఒకవేళ సెక్స్ లో సమస్యలు ఉన్నా.. మఖానా మీ సెక్సువల్ హెల్త్ ను బూస్ట్ చేస్తుంది. ఇదొక ఆయుర్వేద వైద్యంలా పనిచేస్తుంది. రోజూ వీటిని తీసుకోవడం ద్వారా శరీరంలోని బలహీనతలను అధిగమించి ఆరోగ్యంగా తయారయ్యేలా చేస్తుంది.
ఇందులో కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, మినరల్, కొవ్వు, ఫాస్పరస్ లాంటివి ఉంటాయి. ఇవి సెక్సువల్ కోరికలు పెరగడానికి, సామర్థ్యం పెంచడానికి తోడ్పడతాయి. వాటితో పాటు వీర్యంలో నాణ్యతను కూడా పెంచుతుంది.
ఆరోగ్యానికి ఎలా మంచివంటే:
వీటిలో కేలరీలు చాలా తక్కువ. ఫైబర్ ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి కిడ్నీలకు, గుండెకు చాలా మంచిది. శారీరక బలహీనతలు తొలగించి కొద్ది రోజుల్లోనే శరీరానికి బలాన్ని సమకూరుస్తుంది. క్యాల్షియమ్ లోనూ తక్కువేం కాదు. ప్రతి 100గ్రాముల మఖానాలో 350కేలరీలు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా 9.7శాతం ప్రొటీన్లు, 76శాతం కార్బొహైడ్రేట్లు, 12.8శాతం తేమ, 0.1 శాతం ఆరోగ్యకరమైన కొవ్వు, 0.5శాతం సోడియం, 0.9శాతం పాస్పరస్, 1.4మిల్లీ గ్రాముల ఐరన్, కాల్షియం, యాసిడ్, విటమిన్-Vలు పెద్ద మొత్తంలో దొరుకుతాయి.