Malaysia EX PM Arrested : అవినీతి ఆరోపణలతో మలేసియా మాజీ ప్రధాని అరెస్ట్‌

మలేసియా మాజీ ప్రధానమంత్రి ముహిద్దీన్‌ యాసిన్‌ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలతో అరెస్టు చేశామని..అవినీతి నిరోధక సంస్థ అధికారులు తెలిపారు.

Malaysia EX PM Arrested : మలేసియా మాజీ ప్రధానమంత్రి ముహిద్దీన్‌ యాసిన్‌ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలతో అరెస్టు చేశామని..అవినీతి నిరోధక సంస్థ గురువారం (మార్చి 9,2023) వెల్లడించింది. 75 ఏళ్ల యాసిన్ కోర్టు విచారణను ఆయన ఎదుర్కొంటారని వెల్లడించింది. 2020 మార్చి నుంచి 2021 ఆగస్టు వరకు యాసిన్‌ మలేసియా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల్లో అన్వర్ ఇబ్రహీం చేతిలో ఓడిపోయిన మూడు నెలల తరువాత యాసిన్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ ఇవి కేవలం రాజకీయపరంగా చేసే ఆరోపణలు మాత్రమేనని నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని యాసిన్ చెబుతున్నారు.

కోవిడ్ సమయంలో కాంట్రాక్టులకు బదులుగా బిల్డింగ్ కాంట్రాక్టర్లు తన బెర్సాటు పార్టీ ఖాతాలలో డబ్బు జమ చేశారనే ఆరోపణలకు సంబంధించి గురువారం (మార్చి9,2023) MACC వద్ద జరిగిన విచారణకు యాసిన్ స్వచ్ఛందంగా హాజరయ్యారు. యాసిన్ ను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామని ఎంసీసీ చీఫ్ అజంబాకీ తెలిపారు. కానీ గురువారమే యాసిన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై బయటకు వచ్చిన యాసిన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ..కానీ ఇవి కేవలం రాజకీయపరంగా చేసే ఆరోపణలు మాత్రమేనని నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని..నాపై వచ్చిన ఈ ఆరోపణలపై న్యాయపోరాయటం చేస్తానని తెలిపారు.

మలేసియాలో పదవీచ్యుతులైన తర్వాత అవినీతి కేసుల్లో అరెస్టయిన రెండో అగ్రనేత యాసిన్. వివిధ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మరో మాజీ ప్రధాని నజీబ్‌ రజాక్‌ 2018 సాధారణ ఎన్నికల్లో ఓడిపోయారు. పలుమార్లు కోర్టు విచారణకు హాజరైన రజాక్‌ 12 ఏళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నారు. 17 నెలల తన పాలనలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో అధికార దుర్వినియోగం, హవాలా వంటి నేరాలకు పాల్పడినట్లు ముహిద్దీన్‌ యాసిన్‌పై ఆరోపణలున్నాయి.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు