Lottery : భార్య సంతోషం కోసం రెండు లాటరీ టికెట్లు కొన్న భర్త .. రూ.16 కోట్లు గెలుచుకున్న జంట
ఓ వ్యక్తి తన భార్య ముఖంలో సంతోషం కోసం కొన్న లాటరీ టికెట్లకు భారీ ప్రైజ్ గెలుచుకున్నాడు. తన పేరున లాటరీ టికెట్ కొనలేదని అలిగిన భార్యను సంతోష పెట్టటం కోసం భర్త ఒకటి కాదు రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. అంతే భార్య అదృష్టమో ఏమో..దాంట్లో రెండు టికెట్లకు లాటరీ తగిలింది. రూ.16 కోట్లు పైనే గెలుచుకున్నారు.

Lottery
Lottery : ఓ వ్యక్తి తన భార్య ముఖంలో సంతోషం కోసం కొన్న లాటరీ టికెట్లకు భారీ ప్రైజ్ గెలుచుకున్నాడు. తన పేరున లాటరీ టికెట్ కొనలేదని అలిగిన భార్యను సంతోష పెట్టటం కోసం భర్త ఒకటి కాదు రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. అంతే భార్య అదృష్టమో ఏమో..దాంట్లో రెండు టికెట్లకు లాటరీ తగిలింది. రూ.16 కోట్లు పైనే గెలుచుకున్నారు. తమ అదృష్టం పరీక్షించుకోవటానికి ఆ జంట దాదాపు 30ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నారు. కానీ ఎప్పుడు ఒక్క రూపాయి కూడా గెలుచుకోలేదు.కానీ టికెట్లు కొనటం మాత్రం మానలేదు.
ఈక్రమంలో ఎప్పుడు లాటరీ టికెట్లు కొన్నా తనపేరున తన భార్య పేరు కూడా కొనే ఆ వ్యక్తి కొన్ని రోజుల క్రితం తనపేరున మాత్రమే లాటరీ టికెట్ కొన్నాడు. కానీ భార్యపేరుతో కొనలేదు. ఈ విషయం తెలిసిన ఆ భార్యమణి భర్తమీద అలిగింది. బుంగమూతి పెట్టుకుంది. దీంతో భర్త భార్య అలక తీర్చానికి భార్యపేరుతో ఒకటి కాదు రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. ఆ రెండింటికి లాటరీ తగిలింది. అలా రూ.16 కోట్ల 48 లక్షలు గెలుచుకున్నారు. ఆ విషయం తెలిసిన భర్త నా భార్య ఎంత అదృష్టవంతురాలో అని సంబరపడిపోయాడు. ఈ విషయం చెబితే ఎంత సంబరపడిపోతుందో అనుకుంటూ ఆనందంగా ఇంటికెళ్లాడు. భార్యతో విషయం చెప్పాడు. అంతే ఆ భార్యాభర్తల ఆనందం అంతా ఇంతా కాదు.
ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన జంట 30ఏళ్లుగా ఒకే నెంబర్‌పై లాటరీ టికెట్ కొంటున్నారు. కానీ వారికి ఎప్పుడూ నిరాశే ఎదురైంది. తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రతిసారీ వారికి నిరాశే ఎదురైంది. ఈక్రమంలో అతను తనపేరుమీద మాత్రమే టికెట్ కొన్నాడు. ఆ విషయం తెలిసిన భార్య అలిగింది. నాపేరున ఎందుకు కొనలేదు? అంటూ కోపగించుకుంది. దీంతో భర్త భార్య అలక తీర్చటానికి ఆమె పేరు మీద టికెట్ కొనుగోలు చేశాడు. లక్ష్మీ దేవి కరుణించడంతో మార్చి 13న ఒకేసారి రెండు టికెట్లు గెలిచి ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయిపోయారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఆ భార్యాభర్తలు దాదాపు 16 కోట్ల 48 క్షలు గెలుచుకున్నారు.
Dubai Shopping Festival : దుబాయ్‌లో షాపింగ్ ఫెస్టివల్ .. 11 కిలోల బంగారం గెలుచుకున్న భారతీయులు
సోమవారం (మార్చి 13,2023) ఉదయం నెంబర్ పరీక్షించి చూడగా..మొదటి టికెట్‌పై మిలియన్ డాలర్లు(రూ. 8 కోట్లు)గెలుచుకున్నట్లు తెలిసింది. దీంతో నేను రెండో టికెట్ గురించి కూడా తెలుసుకుందామని యత్నించగా వెంటనే రెండో టికెట్ కూడా విన్ అయినట్లు సదరు లాటరీ నిర్వాహకరులు తెలిపారని చెప్పాడు సదరు భర్త. ఈ విషయాన్ని నాభార్యకు చెబితో ఉనందంతో ఎగిరి గంతేసిందని ఆమె కోపమే నాకు లాటరీ తెచ్చిపెట్టిందంటూ తెగ మురిసిపోయాడా వ్యక్తి.