US : మూడేండ్ల నుంచి పచ్చి మాంసమే అతని ఆహారం

వెస్టన్ రోవె. ఇతను వయస్సు 39. యూఎస్ లోని నెబ్రస్క్ లో నివాసం ఉంటున్నాడు. ఏకంగా ఒకటి కాదు..రెండు కాదు..మూడేండ్ల నుంచి తింటున్నాడు.

US : మూడేండ్ల నుంచి పచ్చి మాంసమే అతని ఆహారం

Meat

Updated On : October 13, 2021 / 9:16 AM IST

Man Eating Raw Meat : పచ్చి మాంసాన్ని ఎవరైనా తింటారా ? అంటే ఛీ..మనం ఎమైనా జంతువులమా ? అని అంటారు కదా. కానీ కొంతమంది మాత్రం పచ్చి మాంసాన్ని తింటుంటారు. కూరగానో..ఫ్రై..ఇలా వెరైటీ వెరైటీ వంటలు చేసుకుని ఇష్టంగా తింటుంటారు. కానీ పచ్చి మాంసాన్ని ఏకంగా ఒకటి కాదు..రెండు కాదు..మూడేండ్ల నుంచి తింటున్నాడు. బతికే ఉన్నాడా ? ఇతను అని డౌట్ రావచ్చు. కదా..బేషుగ్గా మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇదే అతడి రోజు వారి ఆహారం. ఎక్కడుంటాడు అడవిలోనా ? అని అనుకుంటున్నారా ? కాదు..జనాల మధ్యలోనే ఉంటున్నాడు. ఇతని గురించ తెలుసుకుందాం…

Read More : మైసమ్మ దేవతకు మద్యం తాగించిన ఆర్జీవీ..! _ RGV Shocking Behavior

 

Meat Us

వెస్టన్ రోవె. ఇతను వయస్సు 39. యూఎస్ లోని నెబ్రస్క్ లో నివాసం ఉంటున్నాడు. కానీ…20 ఏళ్లు ఉన్నప్పుడు ఫిట్ నెస్ పై తాను దృష్టి పెట్టడం జరిగిందని, తర్వాత..ఫుడ్ అలవాట్లతో తనకు చాలా సమస్యలు వచ్చాయన్నారు వెస్టన్. 35 ఏళ్లు వచ్చాక…పచ్చిమాంసం వైపు దృష్టి సారించినట్లు, ఉడబెట్టిన మాంసం కంటే..పచ్చి మాంసం బెటర్ గా ఉందన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి పచ్చిమాంసమే తినడం జరుగుతోందని, ఇలా చేయడం వల్ల తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావడం లేదన్నారు. స్పెషల్ డైట్ వల్ల ఎనర్జీ లెవల్స్ పెరిగాయని, తన రోజు వారి ఆహారంలో 99 శాతం పచ్చి మాంసమే ఉంటుందని తెలిపారు. ఫామ్ హౌస్ నుంచి తెచ్చిన ఫ్రెష్ మాంసాన్ని వాడడం జరుగుతుందని, ప్రాసెస్ చేసిన మాంసాన్ని అస్సలు ముట్టనని వెల్లడించారు.