Britain Inhuman Incident : మృతదేహాన్ని ఫ్రీజర్ లో దాచి పెట్టి మృతుడి పెన్షన్ డబ్బులు కాజేశాడు.. బ్రిటన్ లో అమానవీయ ఘటన
సెప్టెంబర్ 2018లో వెయిన్ రైట్ మరణించారు. అయితే వెయిన్ రైట్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా డెడ్ బాడీని ఫ్రీజర్ లో దాచి పెట్టాడు.

Britain Inhuman Incident
Britain Inhuman Incident : రోజు రోజుకు మానవత్వం మంటగలిసిపోతోంది. కొంతమంది డబ్బే పరమావధిగా భావించి దేనికైనా తెగిస్తున్నారు. పెన్షన్ డబ్బుల కోసం ఓ వ్యక్తి నీతి మాలిన చర్యకు పాల్పడ్డాడు. బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని ఫ్రీజర్ లో దాచి పెట్టి, ఓ వ్యక్తి మృతుడి పెన్షన్ డబ్బులు కాజేసిన వైనం వెలుగుచూసింది.
మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా రెండేళ్లుగా ఫ్రీజర్ లోనే ఉంచి చనిపోయిన వ్యక్తి పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నాడు. ఈ కేసులో డామియన్ జాన్సన్ అనే 52 ఏళ్ల తన నేరాన్ని అంగీకరించాడు.దీంతో అతడిని బ్రిటన్ కోర్టు దోషిగా తేల్చింది. మెట్రో వార్తా పత్రిక కథనం ప్రకారం.. జాన్ వెయిన్ రైట్(71), డామియన్ జాన్సన్(52) అనే ఇద్దరు వ్యక్తులు క్లీవ్ లాండ్ టవర్స్ లో ఒకే ఫ్లాట్ లో నివసిస్తున్నారు.
Village Volunteer: వాలంటీర్ వక్ర బుద్ధి: వృద్దురాలి పెన్షన్ కాజేసిన వైనం
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2018లో వెయిన్ రైట్ మరణించారు. అయితే వెయిన్ రైట్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా డెడ్ బాడీని ఫ్రీజర్ లో దాచి పెట్టాడు. వెయిన్ రైట్ మరణించాడన్న విషయం బయట ఎవరికి తెలియకుండా ఆగస్టు 2020 వరకు దాచి పెట్టాడు. రెండేళ్లుగా మృతుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్న పెన్షన్ డబ్బులు విత్ డ్రా చేసి డామియన్ జాన్సన్ జల్సాలు చేశాడు.
మృతుడి ఏటీఎం కార్డులతో షాపింగ్ చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బ్రిటన్ కోర్టు విచారణ నవంబర్ 7వ తేదీకి వాయిదా పడింది. అయతే, జాన్ వెయిన్ రైట్ మృతికి కారణమేంటి అనే దాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కాగా, డామియన్ జాన్సన్ బెయిల్ పై బయట ఉన్నాడు.