టీ షర్టులు వేసుకుని గిన్నిస్ రికార్డు..మొత్తం ఎన్నంటే..

  • Publish Date - August 24, 2020 / 11:36 AM IST

గిన్నీస్ బుక్ రికార్డు సాధించాలనే తపన చాలామందికి ఉంటుంది. కానీ అది మాటలుకాదు.ఆ రికార్డు సాధించాలంటే వినూత్నంగా ఆలోచించాలి. తాము చేసేది గతంలో ఎవ్వరూ చేయకూడనిది కూడా అయి ఉండాలి. అంటువంటే ఇదిగో ఈ వ్యక్తి. టీషర్టులు వేసుకుని గిన్నీస్ రికార్డు సాధించాడు. అతని పేరు టెడ్ హేస్టింగ్స్.



ఏంటీ టీషర్టులు వేసుకుంటేనే గిన్నీస్ రికార్డు వచ్చేస్తుందా? అనుకోవచ్చు. కానీ అక్కడే ఉంటుంది కొత్తదనం అంటే.. టెడ్ హేస్టింగ్స్ ఒంటి మీద ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 260 టీషర్టులు వేసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేశాడు. తనకోరిన తీర్చేసుకున్నాడు.

అయితే ఈ ఫీట్ అతను 2019 సంవత్సరంలోనే చేశాడు. కానీ ఇటీవలే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తమ ఇన్‌స్టా పేజీలో ఈ వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో హేస్టింగ్స్ ఒక్కో టీషర్ట్‌ వేసుకుంటుండగా, చుట్టూ ఉన్నవారు అతడికి సహాయం చేస్తున్నారు. కానీ ఆ టీషర్టులు అన్నీ ఒకే సైజు ఉంటే కుదరదుగా అందుకే రకరకాల సైజుల్ని ఎంచుకున్నాడు హేస్టింగ్స్.



ఫస్టు మీడియం సైజు టీషర్టు నుంచి మొదలు పెట్టాడు. అలా 20 ఎక్స్ సైజు వరకు టీషర్టులను ఒక్కొక్కటీ వేసుకున్నాడు. అతను అలా టీషర్టులు వేసుకుంటుంటే చుట్టుపక్కల గుమిగూడిన వారంతా ప్రోత్సహిస్తూ రు. అనంతరం ఒక్కొక్కటీ విప్పుతూ లెక్కపెట్టారు. మొత్తం 260 కౌంట్‌ తేలగా, అతడి పేరును గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేశారు.

ఈ రికార్డు గురించి మేస్టింగ్స్ మాట్లాడుతూ..పిల్లలను చదివించటానికి తండ్రిపడే కష్టం పిల్లలకు తెలియాలని చేశానని..ఈ రికార్డు దార్వా వచ్చిన ఓ స్కూల్ ప్లే గ్రౌండ్‌ నిర్మాణానికి వాడతానని తెలిపాడు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.