ఇలాంటి కష్టం ఏ కొడుక్కి రాకూడదు.. 500సార్లు వీర్యం దానం చేసిన తండ్రి

ఇలాంటి కష్టం ఏ కొడుక్కి రాకూడదు.. 500సార్లు వీర్యం దానం చేసిన తండ్రి

Updated On : February 22, 2021 / 2:55 PM IST

Man Scared Of Meeting Siblings On Dating Apps: అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన 24ఏళ్ల జేవ్ కు విచిత్రమైన సమస్య వచ్చింది. బహుశా ప్రపంచంలో ఏ అబ్బాయికి ఇలాంటి సమస్య వచ్చి ఉండదేమో. అమ్మాయిలను ప్రేమించాలంటేనే జేవ్ భయపడుతున్నాడు. డేటింగ్ యాప్ ని చూస్తే చాలు వణికిపోతున్నాడు. దీనికి కారణం తన తండ్రే అంటున్నాడు జేవ్.

జేవ్ తండ్రి వయసులో ఉన్నప్పుడు 500సార్లు వీర్యం దానం చేశాడు. దీంతో జేవ్ ఉంటున్న రాష్ట్రంలో అతడి వీర్యంతో సంతానం పొందిన వారు చాలామందే ఉన్నారు. ఇప్పుడు వారంతా దాదాపు జేవ్‌ వయస్కులే. తల్లులు వేరైనా జన్యుపరంగా జేవ్ తండ్రే జన్మినిచ్చినట్లు కదా. అంటే, వారంతా జేవ్ కు వరుసకు సిస్టర్స్(తోబుట్టువులు) అవుతారన్నమాట. ఇప్పుడీ సమస్య జేవ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. జేవ్‌ ఎవర్నీ ప్రేమించడానికి వీల్లేకుండా చేస్తోంది. లవ్ అంటేనే టెన్షన్ పడేలా చేసింది.

Now, he's trying to build bonds with his half-siblings. Credit: Mirrorpix

ఏ అమ్మాయి తన సోదరవుతుందో తెలియక జేవ్‌ డేటింగ్‌ యాప్‌ల జోలికి పోవడం మానేశాడు. ఇప్పటికే తన చుట్టుపక్కల ప్రాంతాల్లో 8మంది తోబుట్టువులను జేవ్ గుర్తించాడట. అందులో ఒకరు తన స్కూల్ మేట్. ఈ మధ్యే ఆ విషయం తెలిసి అతడు ఆశ్చర్యపోయాడు. అంతేకాదు.. తన తండ్రి వీర్యం ద్వారా జన్మించిన ఇద్దరు సోదరులు ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ఉన్న అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నారట. ఇలా ఎవరిని కలిసినా అందులో తన సోదరులు/సోదరీమణులు ఉంటున్నారు. దీంతో జేవ్ తెగ ఫీల్ అయిపోతున్నాడు. జేవ్ పరిస్థితి చూసి అతడి బంధువులు, ఫ్రెండ్స్.. అయ్యో పాపం.. అని జాలి చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ కొడుక్కి రాకూడదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.