Maradona Watch: దుబాయ్‌లో మారడోనా వాచ్ దొంగ.. అస్సాంలో దొరికాడు అడ్డంగా

ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనా వాచ్ ను దుబాయిలో దొంగిలించిన వ్యక్తిని.. చేజ్ చేసి మరీ అస్సాంలో పట్టుకున్నారు. శనివారం ఉదయం శివసాగర్ జిల్లాలో అడ్డంగా దొరికిపోయాడు.

Maradona Watch: దుబాయ్‌లో మారడోనా వాచ్ దొంగ.. అస్సాంలో దొరికాడు అడ్డంగా

Minors Arrested

Updated On : December 11, 2021 / 3:02 PM IST

Maradona Watch: ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనా వాచ్ ను దుబాయిలో దొంగిలించిన వ్యక్తిని.. చేజ్ చేసి మరీ అస్సాంలో పట్టుకున్నారు. శనివారం ఉదయం శివసాగర్ జిల్లాలో అడ్డంగా దొరికిపోయాడు. యూఏఈలోని దుబాయ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న వ్యక్తిపై పలు కేసులు నమోదు చేశారు.

కొద్ది రోజుల పాటు దుబాయ్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి అస్సాంకు వచ్చిన తర్వాత తిరిగివెళ్లలేదు. ఆరోగ్యం బాగాలేదని చెప్తూ సెలవులు కొనసాగిస్తూ ఉన్నాడు. అతను పనిచేసే చోటే అర్జెంటీనా మాజీ ఫుట్‌బాలర్ వస్తువులు దాచిపెట్టారు. అందులోనే చాలా అరుదైన లిమిటెడ్ ఎడిషన్ Hublot వాచ్ కూడా ఉందని డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా తెలిపారు.

ఆగష్టులో ఇండియాకు వచ్చిన వ్యక్తి తిరిగి దుబాయ్ వెళ్లకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇండియా పోలీసుల సహకారంతో అతని ఇంట్లోనే ఉదయం 4గంటల సమయంలో అరెస్టు చేసి వాచ్ రికవరీ చేసుకున్నారు. ఇరు దేశాల సమన్వయంతో ఇన్వెస్టిగేషన్ జరిగిందనీ సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. నిందితుడిపై పలు కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

……………………………………………….. : వేసవి అపరాల సాగులో తెగుళ్ళు… నివారణ