US Mass Shooting : నరహంతకుడు మృతి.. ఊపిరిపీల్చుకున్న స్థానికులు
గత రెండు రోజులుగా నిందితుడు ఆచూకీ లభించక పోవటంతో స్థానిక ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనకు గురయ్యారు. తాజాగా, పోలీసులు నిందితుడి మృతదేహాన్ని గుర్తించడంలో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

US Mass Shooting
Maine Mass Shooting Suspect : అమెరికాలోని మైన్ రాష్ట్రంలో లెవిస్ టన్ లోని ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోగా.. 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, కాల్పులు జరిపిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పులకు కారణమైన వ్యక్తి 40ఏళ్ల రాబర్ట్ కార్డ్ గా పోలీసులు గుర్తించారు. అతడు అమెరికా ఆర్మీ రిజర్వ్ లో ఆయుధాల ఇన్ స్ట్రక్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. కొంతకాలంగా అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, శుక్రవారం రాత్రి అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి ధ్రువీకరించారు. దీంతో రెండు రోజుల గాలింపు ఆపరేషన్ ను పోలీసులు ముగించగా.. నిందితుడి మృతితో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
కాల్పుల ఘటన తరువాత ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ పోలీస్ కార్యాలయం వారి ఫేస్ బుక్ పేజీలో నిందితుడి రెండు ఫొటోలను విడుదల చేశారు. ఫొటోలో పొడవాటి చేతుల చొక్కా, జీన్స్ ధరించిన, గడ్డం ఉన్నవ్యక్తి కాల్పులు జరుపుతున్నట్లు ఉంది. అయితే, కాల్పులు జరిగినరోజే ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ పెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాల్పులకు పాల్పడిన వ్యక్తి వద్ద గన్ ఉండటంతో మరికొంత మందిపై కాల్పులు జరిపే అవకాశం ఉందని, దీంతో ఆ ప్రాంతంలో అన్ని వ్యాపార సముదాయాలు మూసివేయాలని, ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది.
Also Read : Mukesh Ambani : రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం : ముకేశ్ అంబానీకి బెదిరింపు
గత రెండు రోజులుగా నిందితుడు ఆచూకీ లభించక పోవటంతో స్థానిక ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనకు గురయ్యారు. తాజాగా, పోలీసులు నిందితుడి మృతదేహాన్ని గుర్తించడంలో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దుండగుడు ఇంతటి ఘోరానికి ఎందుకు పాల్పడ్డారనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.