కారు ఖరీదు కన్నా దాని నెంబర్ ప్లేట్ ఖరీదు రెండు రెట్లు ఎక్కువ. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. కారు ధర రూ.25 కోట్లు అయితే దాని నెంబర్ ప్లేట్ ఖరీదు అక్షరాల రూ.52 కోట్లు. కారు ఖరీదే షాకింగ్ గా ఉందనిపిస్తే, దాని నెంబర్ ప్లేట్ ఖరీదు రెండు రెట్లు ఎక్కువగా ఉండటం మరింత విస్మయానికి గురి చేసింది కదూ. అంత ఖరీదైన కారు, దాని నెంబర్ ప్లేట్ వివరాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ.
కార్లలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది:
ఆ కారు పేరు Bugatti Chiron Sport. కార్లలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని మాత్రమే ఇలాంటివి సేల్ అయ్యాయి. భారత్ లో ఇలాంటి కారు కనిపించడం అరుదే. అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) లో అయితే ఇలాంటి కార్లు రోడ్లపై అనేకం కనిపిస్తాయి. ఇవి ఖరీదైన కార్లే కాదు, వీటి నెంబర్ ప్లేట్ కోసం అంతకన్నా ఎక్కువ ధర ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇందుకు నిదర్శనం ఈ కారు నెంబర్. ఆ కారు ధర రూ.25 కోట్లు. కాగా దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ధర అక్షరాల రూ.52కోట్లు. కారు ధర కన్నా రిజిస్ట్రేషన్ నెంబర ధర రెండు రెట్లు ఎక్కువ.
కారు ఖరీదు కన్నా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల ధర ఎక్కువ:
రిజిస్ట్రేషన్ నెంబర్ సైజ్ ఆధారంగా ధరలు ఉంటాయి. కేవలం సింగిల్ డిజిట్ అయినా ధర మాత్రం చాలా ఎక్కువ. అలాంటి రిజిస్ట్రేషన్ నెంబర్ల ధర కాలంతో పాటు పెరుగుతూనే ఉంటాయి. నెంబర్ ప్లేటపై పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. ఆ తర్వాత కొన్న దానికన్నా ఎక్కువ ధరకు నెంబర్ ప్లేట్ ని విక్రయిస్తారు. అదో రకమైన బిజినెస్ అన్నమాట. చాలా సందర్భాల్లో ఇలాంటి నెంబర్ ప్లేట్ల వేలం పాట ద్వారా విక్రయిస్తారు. భారీ ధర పలకడానికి ప్రధాన కారణం వేలం పాటే.
ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ధర అక్షరాల రూ.132కోట్లు:
దుబాయ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ధర రూ.52 కోట్లు అయినప్పటికి.. దీని కన్నా ఖరీదైన నెంబర్లు కూడా ఉన్నాయి. యూకేలో F1 రిజిస్ట్రేషన్ ప్లేట్ ధర అక్షరాల రూ.132 కోట్లు. 2019లో దుబాయ్ లో స్థిరపడిన ఓ భారతీయుడు వేలం పాటలో ఈ నెంబర్ ప్లేట్ ను రూ.60కోట్లకు కొన్నాడు. అతడి పేరు బల్విందర్ సింగ్. వ్యాపార వేత్త అయిన బల్విందర్ సింగ్ తన రోల్స్ రాయిస్ కోసం రూ.60కోట్లు పెట్టి నెంబర్ ప్లేట్ కొన్నాడు.
మెరుపు వేగం ఈ కారు సొంతం:
బుగట్టి చిరోన్ కార్ల విషయానికి వస్తే.. Bugatti Chiron Sport ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత శక్తివంతమైన ఉత్పత్తి వాహనాలలో ఒకటి. 8.0-litre W12 Quad-turbocharged petrol engine నుంచి శక్తిని తీసుకుంటుంది. a 1,479 Bhp పవర్ జెనరేట్ చేస్తుంది. కేవలం 24 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 420 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. కార్బన్ ఫైబర్ తో తయారు చేసిన ఈ స్పోర్ట్ కారు రెగులర్ కారు కన్నా చాలా శక్తిమంతమైనది.