Mayor weds Alligator : మొసలిని పెళ్లాడిన మేయర్.. ఎక్కడో తెలుసా?

వర్షాల కోసం కప్పలకు పెళ్లి చేయడం గురించి విన్నాం. కానీ అక్కడ మొసలిని పెళ్లాడతారట. పురాతన సంప్రదాయలను గౌరవిస్తూ అక్కడి మేయర్ మొసలిని పెళ్లాడారు.

Mayor weds Alligator : మొసలిని పెళ్లాడిన మేయర్.. ఎక్కడో తెలుసా?

Mayor weds Alligator

Mayor weds Alligator : మొసలితో మనిషి పెళ్లేంటి? అది మేయర్ పదవిలో ఉన్న వ్యక్తి అని ఆశ్చర్యపోతున్నారా? పురాతన సంప్రదాయలను గౌరవిస్తూ మెక్సికన్ మేయర్ మొసలిని పెళ్లాడారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Rajasthan : మొసలితో పోరాడి భర్త ప్రాణాలు కాపాడుకున్న మహిళ .. హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు

వర్షాలు పడకపోతే కప్పలకు పెళ్లిళ్లు చేయడం, చెట్టుకి మనిషికి పెళ్లి చేయడం లాంటివి విన్నాం. కానీ మొసలిని పెళ్లి చేసుకోవడం ఏంటి? శాన్ పెడ్రో హుమేలులా మేయర్ హ్యూగో సోసా వైభవంగ జరిగిన వేడుకలో మొసలిని పెళ్లాడారు. ఈ కార్యక్రమం కోసం మొసలిని తెల్లటి దుస్తుల్లో అందంగా తయారు చేసారు. సాంప్రదాయబద్ధమైన సంగీత వాయిద్యాల మధ్య మేయర్ హ్యూగో సోసా మొసలిని ముద్దాడి పెళ్లి చేసుకున్నారు. ఎంతో ఆనందంగా నృత్యం చేశారు. వర్షాల కోసం ప్రకృతిని వేడుకుంటూ పూజ చేయడమే ఈ వేడుకలోని అంతరార్ధమట. ఈ ఆచారం అక్కడ శతాబ్దాలకాలంగా వస్తోందట. వేడుక అనంతరం ట్రంపెట్లు ఊదుతూ, డప్పులు వాయిస్తూ మొసలిని వీధుల్లో ఊరేగించారట.

Crocodiles: బాబోయ్.. వరి పొలంలో భారీ మొసలి.. రైతులు ఏం చేశారంటే..

ఈ సంప్రదాయాన్ని పాటించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని వేడుకను నిర్వహించిన గాడ్ మదర్ అని పిలువబడే ఎలియా ఎడిత్ అగ్యిలర్ చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత తనకు అప్పగించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసారు. మొత్తానికి సంప్రదాయాన్ని గౌరవిస్తూ మెక్సికన్ మేయర్ మొసలిని పెళ్లి చేసుకున్నారు.