Mexico Mafia Don Arrested: డ్రగ్స్ మాఫియా డాన్ అరెస్ట్.. మెక్సికో సిటీలో విధ్వంసం.. 29మంది మృతి

మెక్సికోలో పేరు మోసిన డ్రగ్స్ మాఫియా సూత్రధారి జోయాక్విన్ ఎల్ చాపో కుమారుడు ఒవిడియో గుజ్మన్. ఇతని వయస్సు 32ఏళ్లు. అతన్ని ది మౌస్ అని పిలుస్తుంటారు. ఒవిడియో తండ్రి  ప్రస్తుతం అమెరికాలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతను 2019 సంవత్సరంలో మనీలాండరింగ్, డ్రగ్ స్మిగ్లింగ్ కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. అయితే, చాపో గుజ్మన్ సామ్రాజ్యాన్ని అతని కుమారుడు ఒవిడియో గుజ్మన్ లోపెజ్ నడుపుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఒవిడియోను అరెస్టు చేశారు.

Mexico Mafia Don Arrested: మెక్సికో సిటీలో భయానక వాతావరణం నెలకొంది. డ్రగ్స్ మాఫియా ముఠాదారులు విధ్వంసం సృష్టించారు. డజన్ల కొద్దీ వాహనాలకు నిప్పుపెట్టి దగ్దం చేశారు. స్థానిక విమానాశ్రయంలోని విమానాలపై కాల్పులు జరిపారు. ఫలితంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పది మంది సైనికులతో పాటు 19మంది సామాన్యులు ఉన్నారు. ఇంతటి విధ్వంసానికి కారణం మెక్సికో మాఫియా డాన్ ‘ది మౌస్’ను అరెస్టు చేయడమే.

Sikh Student With Kirpan Arrested: కిర్పాన్ ధరించాడని సిక్కు యువకుడిని అరెస్టు చేసిన పోలీసు.. వీడియో వైరల్

మెక్సికోలో పేరు మోసిన డ్రగ్స్ మాఫియా సూత్రధారి జోయాక్విన్ ఎల్ చాపో కుమారుడు ఒవిడియో గుజ్మన్. ఇతని వయస్సు 32ఏళ్లు. అతన్ని ది మౌస్ అని పిలుస్తుంటారు. ఒవిడియో తండ్రి  ప్రస్తుతం అమెరికాలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతను 2019 సంవత్సరంలో మనీలాండరింగ్, డ్రగ్ స్మిగ్లింగ్ కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. అయితే, చాపో గుజ్మన్ సామ్రాజ్యాన్ని అతని కుమారుడు ఒవిడియో గుజ్మన్ లోపెజ్ నడుపుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆర్నెళ్లుగా అమెరికాతో కలిసి మెక్సికో నిఘా పెట్టింది. తాజాగా భారీ ఆపరేషన్ నిర్వహించి ఎట్టకేలకు అతన్ని ఈనెల 5న క్యులియకాన్ లో అరెస్టు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్స్ ముఠాల్లో వీరిదొకటి.

 

Mexican city

అరెస్టయిన ఒవిడియో గుజ్మన్ లోపెజ్‌ను మెక్సికో సిటీకి తరలించారు. దీంతో ముఠా సభ్యులు మెక్సికో సిటీ, పరిసర ప్రాంతాల్లో పెను విధ్వంసం సృష్టించారు. కార్ల, వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు నిప్పంటించి భయానక వాతావరణం సృష్టించారు. దీంతో సినలోవా ఎయిర్ పోర్ట్ నుంచి రాకపోకలు సాగించలేక వందకుపైగా విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయాల్లోని విమానాలపై ముఠా సభ్యులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో విమానంలో ఉన్నవారు సీట్లకింద దాక్కొని ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

Ovidio Guzman Lopez

 

ఒవిడియో గుజ్మన్ లోపెజ్ ను 2019లో ఓసారి అరెస్టు చేసినప్పటికీ అల్లర్లను నివారించేందుకు ఆయన్ను వదిలేశారు. శుక్రవారం కూడా ఒవిడియో ముఠా సభ్యులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. అధికారులు చేపట్టిన ఆపరేషన్ లో 35 మంది మిలిటరీ సిబ్బంది గాయపడగా, 21 మంది డ్రగ్స్ మాఫియా ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

ట్రెండింగ్ వార్తలు