Sikh Student With Kirpan Arrested: కిర్పాన్ ధరించాడని సిక్కు యువకుడిని అరెస్టు చేసిన పోలీసు.. వీడియో వైరల్

ఈ ఘటన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాధిత యువకుడు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకరు ఫోను చేయడంతో తన వద్దకు పోలీసు అధికారి వచ్చారని, తాను ధరించిన కిర్పాన్‌ ను తీసేయడానికి ప్రయత్నించారని ఆ యువకుడు చెప్పాడు. అయితే, తాను అందుకు తిరస్కరించడంతో తనను అరెస్టు చేశారని వివరించారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులు స్పందిస్తున్నారు.

Sikh Student With Kirpan Arrested: కిర్పాన్ ధరించాడని సిక్కు యువకుడిని అరెస్టు చేసిన పోలీసు.. వీడియో వైరల్

Sikh Student With Kirpan Arrested

Sikh Student With Kirpan Arrested: ఓ సిక్కు యువకుడు తమ సంస్కృతిలో భాగంగా కిర్పాన్‌ ధరించాడు. అయితే, అందుకుగాను ఆ యువకుడి వద్దకు వచ్చిన ఓ పోలీసు కుర్చీలోంచి అతడిని లేపి చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లాడు. ఈ ఘటన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాధిత యువకుడు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఒకరు ఫోను చేయడంతో తన వద్దకు పోలీసు అధికారి వచ్చారని, తాను ధరించిన కిర్పాన్‌ ను తీసేయడానికి ప్రయత్నించారని ఆ యువకుడు చెప్పాడు. అయితే, తాను అందుకు తిరస్కరించడంతో తనను అరెస్టు చేశారని వివరించారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులు స్పందిస్తున్నారు.

కిర్పాన్‌ ధరించడం తమ సంస్కృతిలో భాగమని, ఈ విషయం తెలియకుండా ఆ యువకుడిని అరెస్టు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెచ్చగొట్టే చర్యలకు ఏమీ పాల్పడకపోయినప్పటికీ ఇలా అరెస్టు చేయడం సరికాదని మరో నెటిజన్ పేర్కొన్నాడు. చాలా మంది అమెరికన్లు తుపాకులు పట్టుకుని తిరుగుతున్నప్పటికీ వారిని అరెస్టు చేయని పోలీసులు, సిక్కు యువకుడు కిర్పాన్‌ ధరిస్తే అరెస్టు చేయడం ఏంటని మండిపడుతున్నారు.

Kishan Reddy slams Kcr: హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక సమయంలో ‘దళిత బంధు’.. ఇప్పుడు ‘గిరిజన బంధు’: కిషన్ రెడ్డి