Kishan Reddy slams Kcr: హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక సమయంలో ‘దళిత బంధు’.. ఇప్పుడు ‘గిరిజన బంధు’: కిషన్ రెడ్డి

హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ‘దళిత బంధు’ అంటూ ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెట్టారని, ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ‘గిరిజన బంధు’ అంటూ మరోసారి ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ వైఫల్యాలను కల్పిపుచ్చుకునేందుకు కేంద్ర సర్కారుని నిందిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Kishan Reddy slams Kcr: హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక సమయంలో ‘దళిత బంధు’.. ఇప్పుడు ‘గిరిజన బంధు’: కిషన్ రెడ్డి

Kishan Reddy slams Kcr: హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ‘దళిత బంధు’ అంటూ ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెట్టారని, ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ‘గిరిజన బంధు’ అంటూ మరోసారి ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని  అన్నారు. కేసీఆర్‌ వైఫల్యాలను కల్పిపుచ్చుకునేందుకు కేంద్ర సర్కారుని నిందిస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో పంచాయతీ నిధులను సకాలంలో విడుదల చేయకుండా సర్పంచ్‌లను బెదిరిస్తున్నారని చెప్పారు. ఓ వైపు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంటే, మరోవైపు కేసీఆర్ ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానంటున్నారని విమర్శించారు. పలు రాష్ట్రాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్తున్న కేసీఆర్ తెలంగాణలో ప్రతిపక్షాలను మాత్రం కలవట్లేదని చెప్పారు.

కేసీఆర్ దేశాన్ని ఏం ఉద్దరిస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో పలు శాఖలకు చెందిన చెల్లింపులు కూడా సకాలంలో జరపలేకపోతున్నారని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించట్లేదని చెప్పారు. భారత్ లో అసత్యాలాడే కుటుంబాల్లో కల్వకుంట్ల కుటుంబం నంబర్‌ వన్‌ స్థానంలో ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ధరణి పోర్టల్‌ తెచ్చాక ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు.

Make-in-India: మేకిన్ ఇండియా ఫలితం.. 636 శాతం పెరిగిన బొమ్మల ఎగుమతులు