Make-in-India: మేకిన్ ఇండియా ఫలితం.. 636 శాతం పెరిగిన బొమ్మల ఎగుమతులు

‘మేకిన్ ఇండియా’ నినాదంతో మన దేశంలో బొమ్మల తయారీ రంగం ఊపందుకుంది. ఒకప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఈ రంగం అభివృద్ధి చెందింది. ఇటీవలి కాలంలో 636 శాతం ఎగుమతులు పెరిగాయని కేంద్రం తెలిపింది.

Make-in-India: మేకిన్ ఇండియా ఫలితం.. 636 శాతం పెరిగిన బొమ్మల ఎగుమతులు

Make-in-India: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా’ ద్వారా ప్రగతి సాధించిన రంగాల్లో బొమ్మల తయారీ ఒకటి. ఒకప్పుడు మన దేశంలోకి బొమ్మలు ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి అయ్యేవి. కానీ, మేకిన్ ఇండియా ఫలితంగా బొమ్మల్ని ఇక్కడే తయారు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు దేశంలో బొమ్మల అమ్మకాలు సాగించడమే కాకుండా.. కంపెనీలు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి.

Karnataka: రుణాలు చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయడం కుదరదు.. కొత్త చట్టం తేనున్న కర్ణాటక

ఈ ఏడాది ఏప్రిల్-ఆగష్టు వరకు బొమ్మల ఎగుమతుల్లో 636 శాతం వృద్ధి సాధించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. 2013లో ఇదే సమయంతో పోలిస్తే ఈ వృద్ధి నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో మన దేశంలో బొమ్మలకు ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. మన దగ్గర వీటి తయారీకి కావాల్సిన ముడి సరుకు, టెక్నాలజీ, డిజైనింగ్ నైపుణ్యం, సిబ్బంది వంటి వనరులు తక్కువగా ఉండేవి. అందుకే ఇక్కడ తక్కువగా బొమ్మలు తయారయ్యేవి. విదేశాల నుంచే ఎక్కువగా తెచ్చుకునే వాళ్లం.

Husband Stabs Wife: బిహార్‌లో దారుణం.. భార్య ఉద్యోగం చేస్తున్నందుకు కత్తితో పొడిచిన భర్త

2018-19లో దాదాపు రూ.2,960 కోట్ల విలువైన బొమ్మల్ని మన దేశం దిగుమతి చేసుకుంది. పైగా ఈ బొమ్మలు నాణ్యత ఉండేవి కావు. మన ప్రమాణాలకు దూరంగా ఉండటమే కాకుండా ఇవి అంత సురక్షితమైనవి కావు. వీటి తయారీలో హానికర కెమికల్స్, రంగులు వంటివి వాడేవాళ్లు. అందుకే విదేశాల నుంచి దిగుమతులు తగ్గించి, ఇక్కడే వీటిని తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే దిగుమతి సుంకాన్ని 20 నుంచి 60 శాతానికి పెంచింది. దిగుమతి చేసుకునే ప్రతి బొమ్మ మన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిబంధనలు మార్చింది. ప్రతి బొమ్మ శాంపిల్‌ను అధికారులు పరిశీలించి, పరీక్షించిన తర్వాతే దిగుమతికి అనుమతిస్తున్నారు. అలాగే బొమ్మల తయారీ పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నారు.

Ankita Bhandari: పేదదాన్నే.. కానీ పది వేలకు నన్ను నేను అమ్ముకోలేను.. స్నేహితురాలికి మెసేజ్ చేసిన అంకిత

రాయితీలు, మానవ వనరులు, మార్కెటింగ్ వంటి విషయాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తోంది. మూడేళ్లుగా బొమ్మలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తోంది. దీంతో దేశీయంగా బొమ్మల తయారీ ఊపందుకుంది. భారీ స్థాయిలో బొమ్మలు తయారవుతుండటంతో విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాయి కంపెనీలు. 2013తో పోలిస్తే 2022లో బొమ్మల ఎగుమతి 636 శాతం పెరిగినట్లు కేంద్రం చెప్పింది. ప్రస్తుతం మేడిన్ ఇండియా అనే కాకుండా.. మేడ్ ఫర్ వరల్డ్ అనే కాన్సెప్ట్‌తో మన దేశంలో బొమ్మల తయారీ సాగుతోందని కేంద్రం వెల్లడించింది.