తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్.. ఎల్లో అలర్ట్.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త
ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

Weather Updates: తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ములుగు, హనుకొండ, వరంగల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. (Weather Updates)
Also Read: నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్..
నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు.
మరోవైపు, తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల వర్షాలు కురుస్తాయని వివరించింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవచ్చని పేర్కొంది.