అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ మైక్రోసాఫ్ట్ న్యూ ఆఫీసు యాప్ కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ఈ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. మొబైల్ ప్రొడక్టవిటీ కోసం అత్యంత ప్రసిద్ధి చెందిన యాప్స్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అన్నికలిపి ఒకే యాప్‌లో ఇంటిగ్రేడ్ చేసింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు మైక్రోసాఫ్ట్ అందించే యాప్ లను వేర్వేరుగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
సింగిల్ యాప్‌పై అన్ని యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రివ్యూ కోసం లాంచ్ చేసిన ఈ Offfice యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూజర్లు యాప్ ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఐఓఎస్ యూజర్లు ఆపిల్ టెస్ట్ ఫ్లయిట్ ప్రొగ్రామ్ ద్వారా Office యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.. అవి ఏంటో తెలుసుకుందాం.
* న్యూ ఆఫీసు యాప్.. మొబైల్ డివైజ్ ల్లో ఈజీగా కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు.
* ఒక డాక్యుమెంట్ ను Snap ఇమేజ్ మాదిరిగా మార్చేయచ్చు.
* ఆ ఇమేజ్ ను Word ఫైల్ మాదిరిగా ఎడిట్ చేసుకోవచ్చు.
* ట్రాన్స్ ఫాం టేబుల్స్ నుంచి ఫ్రింటెడ్ పేజ్ నుంచి Excel కు మార్చుకోవచ్చు.
* ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ New Office యాప్ అందుబాటులో ఉంది.
* గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు App అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఆపిల్ టెస్ట్ ఫ్లయిట్ ప్రొగ్రామ్ ద్వారా iOS యూజర్లు కొత్త అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.