ఇజ్రాయెల్ కోసం ఎందాకైనా సిద్ధమంటున్న అమెరికా.. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, హెజ్‌బొల్లా, హమాస్‌

ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి దిగుతోంది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

Middle East tension can leads to World War 3

Middle East tension: టపాసులు పేల్చినంతా ఈజీగా బాంబులతో అటాక్. చిచ్చుబుడ్లు కాల్చినంత సింపుల్‌గా మందుపాతరల పేల్చివేత. రాకెట్ల లాగా దూసుకొచ్చే లాంచర్ల మోత. కొన్నాళ్లుగా ఇది పశ్చిమాసియా దేశాల్లో కామన్ అయిపోయింది. గతేడాది నుంచి జరుగుతోన్న ఇజ్రాయెల్, పాలస్తీనా వార్ కొత్త టర్న్ తీసుకుంటోంది. పాలస్తీనా తరఫున హమాస్ రంగంలోకి దిగి కాల్పుల మోతతో దొంగదెబ్బ తీస్తూ ఇజ్రాయెల్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇజ్రాయెల్ హమాస్‌ను టార్గెట్ చేసి టాప్ లీడర్లను ఖతం చేస్తుండటంతో ఇప్పుడు.. ఇరాన్, హెజ్‌బొల్లా అటాక్స్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి దిగుతోంది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ జరిగితే.. 
హమాస్ మిలిటెంట్ల దాడులతో ఉక్కిరిబిక్కిరైన ఇజ్రాయెల్.. మొసాద్‌ను రంగంలోకి దించింది. హమాస్ టాప్ లీడర్లు హనియా, డెయిఫ్‌లను ఖతం చేసింది. హనియాను ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో చంపడంపై ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. తమ భూభాగంలో ఉన్న హనియాను.. తమ దేశానికే చెందిన పౌరులను సీక్రెట్ ఏజెంట్లుగా ఉపయోగించి.. కోవర్ట్ ఆపరేషన్ చేయడంపై రగిలిపోతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై దాడులు తప్పవని హెచ్చరించిన ఇరాన్ ఏ సమయంలోనైనా అటాక్స్ చేసేందుకు రెడీ అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులు చేసింది ఇరాన్. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ జరిగితే పరిస్థితి ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళనలు ఉన్నాయి.

హమాస్ కౌంటర్ ఆపరేషన్ స్కెచ్‌లు
తమ కీలక నేతలను చంపిన ఇజ్రాయెల్‌పై కౌంటర్ ఆపరేషన్ స్కెచ్‌లు వేస్తోంది హమాస్. మరోవైపు లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా కూడా హమాస్ అగ్రనేత హనియా హత్యకు ప్రతీకారం తీసుకునేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్‌పై దాడులు స్టార్ట్ చేసింది. అటు హమాస్, ఇటు హెజ్‌బొల్లా ఇరాన్‌ సహకారంతో రెచ్చిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఇజ్రాయెల్‌ రక్షణ దళం IDF కూడా అలర్ట్ అయింది. ఇజ్రాయెల్‌ కోసం ఎందాకైనా సిద్ధమంటూ.. పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు, ఫైటర్‌ జెట్లను పంపిస్తోంది అగ్రరాజ్యం అమెరికా.

Also Read : ఇజ్రాయెల్ ఎందుకు అతడిని వెంటాడి.. వేటాడి మట్టుబెట్టింది..?

డైరెక్టుగా యుద్ధ రంగంలోకి ఇరాన్ 
ఇజ్రాయెల్ టార్గెట్‌గా ఇరాన్, హమాస్, హెజ్‌బొల్లా వ్యూహాలు రచిస్తున్నాయి. భూభాగాల ఆక్రమణ కోసం జరుగుతున్నా ఈ పోరులో చావోరేవో తేల్చుకునేందుకు శ్రమిస్తోంది ఇజ్రాయెల్. అయితే హమాస్ టాప్ లీడర్లు ఖతం కావడంతో.. హెజ్‌బొల్లా, ఇరాన్ డైరెక్టుగా యుద్ధ రంగంలోకి దిగే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే మరింత మారణహోమం తప్పేలా లేదు. ఇరాన్‌కు మద్దతుగా అమెరికా క్షిపణులు ప్రయోగిస్తే ప్రాణనష్టం ఏ లెవల్‌లో ఉంటుందో చెప్పలేం. ఇరాన్ దగ్గర ఐరన్ డోమ్‌లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ డ్రోన్లు ఉన్నాయి. హెజ్‌బొల్లా దగ్గర 2లక్షల వరకు రాకెట్లు, మిస్సైల్స్ ఉన్నాయని అంచనా. ఒకసారి ఇరాన్, హెజ్‌బొల్లా అటాక్స్ స్టార్ట్ చేస్తే.. ఇజ్రాయెల్ తరఫున అమెరికా తన ఫైటర్ జెట్స్‌కు పని చెప్పనుంది.

Also Read : వరుసపెట్టి హమాస్ లీడర్లను ఖతం చేస్తున్న మొసాద్.. వెంటాడి వేటాడుతోన్న ఇజ్రాయెల్

ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తే..
ఇప్పుడు మెజార్టీ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నాయి. చైనా పాలస్తీనాకు అనుకూలంగా ఐక్యరాజ్యసమితిలో ఓటేసింది. రష్యా కూడా ఇండైరెక్టుగా పాలస్తీనాకు మద్దతు తెలుపుతోంది. హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా చూడటం లేదు రష్యా. ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధ జరిగితే.. ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై రెండువర్గాలు ఉన్నాయి. ఒక గ్రూప్‌ను చైనా, రష్యా లీడ్ చేస్తుంటే.. మరొకటి అమెరికా ఆధ్వర్యంలో నడుస్తోంది. మిడిల్ ఈస్ట్ వార్‌లో అమెరికా దాని అనుకూల దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే.. రష్యా, చైనా తరఫున నిలిచే దేశాలు పాలస్తీనా, ఇరాన్‌ వైపు నిలిచి దాడులు చేసుకునే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. అదే జరిగితే మూడో ప్రపంచం యుద్ధానికి దారి తీయొచ్చని.. పరిస్థితులు అటువైపు దారి తీస్తే ప్రపంచ నాశనం ఖాయమంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు