Viral Video: తప్పిపోయిన బాలికను ఇలా అడవుల్లో గుర్తించిన అధికారులు

ఆమె నడుచుకుంటూ చిత్తడి అడవుల్లోకి వెళ్లి అక్కడే బయటకు రాలేక అక్కడే ఉండిపోయింది.

Viral Video: తప్పిపోయిన బాలికను ఇలా అడవుల్లో గుర్తించిన అధికారులు

Florida girl

Updated On : March 1, 2024 / 4:57 PM IST

ఇంటి నుంచి వెళ్లి తప్పిపోయిన ఓ బాలిక (5) అడవుల్లో కనపడింది. ఆమెను అధికారులు సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసిన అధికారులు వివరాలు తెలిపారు.

ఆటిజంతో బాధపడుతున్న ఓ బాలిక నాలుగు రోజుల క్రితం తన ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె నడుచుకుంటూ చిత్తడి అడవుల్లోకి వెళ్లి అక్కడే బయటకు రాలేక అక్కడే ఉండిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో థర్మల్ ఇమేజింగ్ కెమెరా సాయంతో అడవుల్లో ఆమెను వెతికారు.

ఆమె ఎక్కడ ఉందో ఆ కెమెరా ద్వారా అధికారులు గుర్తించారు. ఆ లొకేషన్‌కు వెళ్లి ఆమెను తీసుకొచ్చారు. అధికారులను చూడగానే ఆ బాలిక మురిసిపోయింది. ఆమెను ఎత్తుకుని జీపులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకు వెళ్లారు. ఆ బాలికకు ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు.

 Also Read: బెంగళూరులోని కేఫ్‌లో పేలుడు కలకలం