Moderna Vaccine : బాలలపై 100 % పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సిన్..

Moderna Vaccine 100 % Best results : కరోనా ఉదృతి పెరుగుతున్న క్రమంలో చిన్నారులపై వ్యాక్సిన్ ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా 12 నుంచి 17 ఏళ్ల బాలలపై చేసిన ప్రయోగాల్లో మోడేర్నా టీకా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లుగా తేలింది. దీంతో వచ్చే జూన్ నెలలో సంస్థలకు దరఖాస్తులు చేస్తామని మోడెర్నా తెలిపింది. ఇప్పటికే అమెరికాలో 12 నుంచి 15 ఏళ్లు పైబడిని వారికి వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఫైజర్ అనుమతి పొందిన విషయం తెలిసిందే.

వ్యాక్సిన్ ప్రయోగాల్లో భాగంగా మోడెర్నా 12 నుంచి 17 ఏళ్ల వయస్సున్న 3,732 మంది బాలలపై ప్రయోగించింది. కొవిడ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన ఫార్మా కంపెనీల్లో మోడెర్నా కూడా ఒకటి. తాము రూపొందించిన వ్యాక్సిన్ బాలలపైనా సమర్థవంతంగా పనిచేస్తోందని మోడెర్నా వెల్లడించింది. 12 నుంచి 17 ఏళ్ల బాలలపై తమ కొవిడ్ టీకాను ప్రయోగించి చూడగా, 100 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని మోడెర్నా వివరించింది. ఈ క్రమంలో జూన్ ఆరంభంలో ఎఫ్ డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతులు కోరేందుకు రంగం సిద్ధం చేస్తోంది మోడెర్నా. మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 93 శాతం సమర్థవంతంగా పనిచేసినట్లుగా తేలింది.

మోడెర్నా వ్యాక్సిన్ కు ఇప్పటికే అమెరికాలో ఎఫ్ డీఏ అనుమతులు ఉండగా, వ్యాక్సిన్ ను చిన్నారులకు కూడా ఉపయోగించేందుకు అనుమతిని విస్తరింపజేయాలని కోరనుంది. ఎఫ్ డీఏ అనుమతులు వస్తే, టీకా ఉత్పత్తిని మరింత పెంచనుంది. మోడెర్నా తన టీకాలను ఎం-ఆర్ఎన్ఏ 1273 సాంకేతిక విధానంతో అభివృద్ధి చేసింది. మోడెర్నా కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల వ్యాక్సిన్. దీన్ని ఇప్పటికే అమెరికాలో పెద్ద వయస్సు వాళ్లకు కూడా ఇస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు