ట్రంప్‌కు ముందే మోడీ: వెల్‌కమ్ స్పీచ్‌లో ఇలా

ట్రంప్‌కు ముందే మోడీ: వెల్‌కమ్ స్పీచ్‌లో ఇలా

Updated On : February 24, 2020 / 8:27 AM IST

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత పర్యటన సందర్భంగా మోటేరా స్టేడియానికి చేరుకున్నారు. ట్రంప్ కోసమే ప్రారంభోత్సవానికి సిద్ధమైన స్టేడియంలో భారీ జనసందోహం మధ్య ప్రసంగించారు. ట్రంప్ మాట్లాడటానికి ముందు ప్రధాని మోడీ స్వాగతం చెబుతూ ప్రసంగించారు. అగ్రరాజ్య అధినేత ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 

  • భారత్ అమెరికాల స్నేహం సుదీర్ఘంగా ఉండాలి. నమస్తే ట్రంప్. 
  • ఇవాళ మోటేరా స్టేడియంలో చరిత్ర మొదలైంది. దీనిని మనం కళ్లారాచూస్తున్నాం. 
  • ఐదు నెలల క్రితం అమెరికాలో హ్యూస్టన్ కు హౌడీ మోడీ కోసం వెళ్లాను.
  • అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్  ఇవాళ ఇక్కడ ఉన్నారు. 
  • అక్కడి నుంచి ఇక్కడి నేరుగా వచ్చేశారు. ఇంత ప్రయాణం చేసినప్పటికీ నేరుగా ఇక్కడికే వచ్చారు. 
  • ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం నుంచి మీకు స్వాగతం తెలపుతున్నాం.
  • ఆకాశం వరకూ ఉన్న గాలి ఇదంతా మనదే. ఎయిర్ పోర్ట్ నుంచి ఇక్కడి వరకూ ఉన్న ప్రాంతంలో భారతీయత కనిపిస్తుంది. 
  • ట్రంప్.. సతీమణి, ఇవాంక లు వచ్చారు. 
  • భారత్.. అమెరికాలు ఓ కుటుంబంలా ఉండాలి.
  • ఇది మరో భాగస్వామ్యం. గ్రేటర్, రిలేషన్ షిప్ డెవలప్ అవ్వాలి. 
  • ఈ కార్యక్రమం పేరు నమస్తే. దాని అర్థం కూడా చాలా గొప్పది.
  • పురాతన భాష అయిన సంస్కృతం నుంచి గూడార్థం ఉంది. వ్యక్తి కోసం కాదు. అతని గురించి కూడా చెప్తుంది. 
  • ఫ్రెండ్స్ మనం ఈ భూమి మీద ఉన్నాం. ఎక్కడైతే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాం. 
  • భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన సబర్మతీ ఆశ్రమం దగ్గరే ఉన్నాం.
  • రిచ్ డైవర్సిటీ, యూనిటీ, యూనిటీలో వైబ్రేషన్, భారత్-అమెరికా సంబంధాలు బలంగా ఉన్నాయి.
  • ప్రపంచాన్ని ఒక కుటుంబంలా ఫీలవుతాం. 
  • స్టేట్యూ ఆఫ్ లిబర్టీని ఒకరు గౌరవంగా భావిస్తే. సర్దార్ వల్లభాయ్ విగ్రహాన్ని మనం గౌరవంగా భావిస్తాం.
  • ప్రెసిడెంట్ ట్రంప్.. బాగా ఆలోచిస్తారు. అమెరికా కలను సాకారం చేయడానికి ప్రపంచానికి తెలుసు. 
  • ట్రంప్ కుటుంబానికి విశేష అభినందనలు తెలియజేస్తున్నాం. మెలానియా తొలిసారి ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది.
  • హ్యాపీ అమెరికా కోసం మీరుచేసింది ఫలించింది.
  • సమాజం కోసం మీరు చేసిన పని ప్రశంసించదగ్గది.
  • ఇవాంక రెండు సంవత్సరాలు ముందే వచ్చారు. మళ్లీ ఒకసారి వస్తాను. నాకు ఆనందంగా ఉందని అనుకుంటున్నానని చెప్పింది.
  • మీరు లైమ్ లైట్ కు దూరంగా ఉన్నా.. మీ పని మిమ్మల్ని కనపడేలా చేస్తుంది. 
  • మిమ్మల్ని కలవడం, ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది.
  • మీరు, నేను, భారతదేశం, ప్రపంచమంతా ట్రంప్ మాటలు వినడానికి ఎదురుచూస్తుంది.
  • 130కోట్ల మంది తరపు నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ కు స్వాగతం తెలియజేస్తున్నాను. మీ కోసం ట్రంప్ మాట్లాడతారు.