ప్రపంచమంతా వాలెంటైన్స్ డేలో మునిగిపోయింది. అంతా ప్రేమమయం ఎక్కడా చూసినా ప్రేమ పక్షులు, జోడీలుగా కబుర్లు, జంటగా షికార్లు అవే తన కొడుకుకి కూడా కావాలని ఓ కన్నతల్లి పడరాని పాట్లు పడతుంది. అమెరికాలోని మేరీలాండ్ టౌసన్ యూనివర్సిటీలో ఓ మహిళ రెండు వారాలుగా ఫోన్‌లో తన కొడుకు ఫొటో చూపించి డేటింగ్ చేయమని కాలేజీ స్టూడెంట్స్ ని అడుగుతుందట.
చాలా మంది విద్యార్థినులు కాలేజీ మేనేజ్‌మెంట్‌కు కంప్లైంట్ చేస్తుండటంతో విచారణ జరిపారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ‘టీ-షర్ట్, జీన్స్ ధరించిన ఓ మహిళ మల్టీ కలర్ స్కార్ఫ్‌తో కాలేజిలో తరచుగా కనిపిస్తూ ఫోన్‌లోని తన కొడుకు ఫొటో చూపించి అమ్మాయిలను డేటింగ్ చేయమని కోరుతుంది. ఆవిడ ఎవరు, ఎక్కడ నుంచి వచ్చిందోననే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాలేజీ యాజమాన్యం ఆవిడపై ఏ ఫిర్యాదు చేయలేదట. పైగా జాలి పడాల్సిన పరిస్థితి అంటూ పేర్కొందట. ఈ వీడియో వైరల్‌గా మారిన కొద్ది క్షణాల్లో సోషల్ మీడియాలో కామెంట్ల వెల్లువ మొదలైంది. ఇంతకీ ఆ కొడుకు డేటింగ్ చేయడం కోసం మంచి వాలెంటైన్ దొరికిందో లేదో మరి…
Also Read : తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స
Also Read : మనోళ్లకే ఫస్ట్ ప్రైజ్: మంచుతో మహావిష్ణు శిల్పం
Also Read : ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే
Also Read : ఫిబ్రవరిలోనే లాంచ్ : ‘రెడ్ మీ నోట్ 7’ వచ్చేస్తోంది
Also Read : తెలుగులో కూడా పేటీఎం సేవలు
Also Read : ZOMATO CHAT: అమ్మతోడు సార్.. మీ డబ్బులు వచ్చేస్తాయ్