Monkey Made Emergency Call : ఎమర్జన్సీ నంబర్ కు ఫోన్ చేసి పోలీసుల్ని పరుగులు పెట్టించిన కోతి పిల్ల

ఎమర్జన్సీ నంబర్ కు ఫోన్ చేసి పోలీసుల్ని పరుగులు పెట్టించిందో కోతి పిల్ల.

Monkey Made Emergency Call : ఎమర్జన్సీ నంబర్ కు ఫోన్ చేసి పోలీసుల్ని పరుగులు పెట్టించిన కోతి పిల్ల

Monkey Made Emergency Call

Updated On : August 18, 2022 / 5:28 PM IST

Monkey made emergency call : కోతి పనులు అని ఊరికనే అనరు. కోతులు చేసే పనులు అలా ఉంటాయి మరి. ఇక కోతిపిల్లలు చేసే అల్లరి గురించి చెప్పనే అక్కర్లేదు. ఓ కోతిపిల్ల చేసిన పనికి అమెరికాలో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఓ కోతిపిల్ల ఎమర్జన్సీ సర్వీస్ 911 కు ఫోన్ చేసి పోలీసుల్ని ఆగమాగం చేసింది. కోతేంటీ పోలీసులకు ఫోన్ చేసిన మ్యాటర్ ఏంటంటే..

అమెరికాలో ఎమర్జన్సీ సర్వీసు 911కు ఓ ఫోన్ వచ్చింది. కానీ అవతలి నుంచి ఎవ్వరు మాట్లాడలేదు. కాసేపటికి కాల్ కట్ అయ్యింది. దీంతో అవతలి వ్యక్తి ఏదో ప్రమాదంలో పడి ఉంటారు అందుకే కాల్ కట్ అయ్యిందని పోలీసులు భావించారు. దీంతో ఆ కాల్ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేసి కనుక్కున్నారు. ఆ ఫోన్ కల్ పాసో రోబుల్స్ ప్రాంతంలోని జూ లో నుంచి ఫోన్ చేసినట్టు గుర్తించారు. అంతే జూలో ఏదో జంతువు ఎవరిపైనే దాడి చేసిందా? ఏంటో అని భావించారేమో..వెంటనే సాన్ లూస్ పోలీసు అధికారులు జూ వద్దకు ఉరుకులు పరుగుల మీద చేరుకున్నారు.

జూ లోపలికి వెళ్లాక అధికారులు ఎంతగా గాలించినా ఆపదలో ఉన్న ఎవరూ కనిపించలేదు. ఆ ఫోన్ కు మళ్లీ మళ్లీ కాల్ చేసినా రింగ్ అవుతోందే తప్ప ఎవరూ ఎత్తడం లేదు. దీనితో పోలీసుల్లో మరింత టెన్షన్ పెరిగిపోయింది. అలా జూ సిబ్బంది సహాయంతో అసలు విషయం తెలుసుకున్నారు. కపుచిన్ జాతికి చెందిన రూట్ అనే కోతి పిల్ల ఆ ఫోన్ చేసినట్టు గుర్తించారు.జూలో సామగ్రిని అటూ ఇటూ తరలించేందుకు వినియోగించే బండి నుంచి ఆ కోతి పిల్ల ఫోన్ ను ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు గుర్తించారు. ఫోన్ ను ఎత్తికెళ్లిన కోతి పిల్ల.. దానిపై నంబర్లను నొక్కుతూ, నొక్కుతూ ఉండగా 911 కు కాల్ వచ్చినట్టు తేల్చారు. మెల్లగా ‘రూట్’ కోతిపిల్లను పట్టుకుని దాని నుంచి ఫోన్ తీసుకున్నారు.

అప్పుడా కోతిపిల్ల ఎక్స్ ప్రెషన్ కు పోలీసులు తెగ నవ్వుకున్నారట. ఆకోతిపిల్ల అమాయకంగా ముఖం పెట్టడం, గందరగోళానికి గురవడం చూసి భలే నవ్వు వచ్చిందని పోలీసులు నవ్వుకుంటూ చెప్పారు.ఈ కోతి పిల్ల వ్యవహారానికి సంబంధించి.. ఆ కోతి పిల్ల ఫొటోలతో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.