తల్లి, సోదరుడు మృతదేహాల పక్కనే కూర్చొని చాక్లెట్ తింటూ, ఈగలు ముసిరిన స్థితిలో వారంరోజులుగా నాలుగేళ్ల చిన్నారి.. అసలేం జరిగిందంటే..?
తల్లి, సోదరుడు గుర్తు తెలియని కారణాలతో మరణించారు. నాలుగేళ్ల చిన్నారి ‘ప్రామిస్’ వారి మృతదేహాల వద్ద బెడ్ పై కూర్చొని..

Tragedy in New York
New York Crime: తల్లి, సోదరుడు గుర్తు తెలియని కారణాలతో మరణించారు. నాలుగేళ్ల చిన్నారి ‘ప్రామిస్’ వారి మృతదేహాల వద్ద బెడ్ పై కూర్చొని ఉంది. ముఖం నిండా చాక్లెట్ పూసుకొని ఉండటంతో.. ఆమె చుట్టూ ఈగలు ముసురుకొని ఉన్నాయి. మరోపక్క మృతదేహాల నుంచి దుర్వాసన వస్తుంది. వారం రోజులుగా ఆ చిన్నారి చాక్లెట్ తింటూ మృతదేహాల పక్కనే ఉండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆ చిన్నారి పరిస్థితిని చూసి కన్నీటి పర్యాంతమయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇంతకీ ఏం జరిగింది.. పోలీసులు విచారణలో ఏమని తేలింది అనే విషయాల్లోకి వెళితే..
అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. లీసా కాటన్ (38) కుమారుడు నాజిర్ మిల్లియెన్(78), నాలుగేళ్ల కుమార్తె ప్రావిస్ తో ఓ అపార్ట్ మెంట్ లో కలిసి ఉంటుంది. అయితే, వారంరోజులుగా వారింట్లో నుంచి ఎవరూ బయటకురాలేదు. అనుమానం వచ్చిన స్థానికంగా ఉండే ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ ప్లాట్ వద్దకు వెళ్లి తలుపుతట్టగా ఎలాంటి స్పందనలేదు. పక్కన ప్లాట్ వాళ్లును వాకబు చేయగా.. ఆ ఇంట్లో వాళ్లు కొద్దిరోజులుగా కనిపించడం లేదు.. ఇంట్లో ఎలాంటి శబ్దాలు రావడం లేదని చెప్పారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత ప్లాట్ యాజమాని లిసా కాటన్ తండ్రి హుబర్డ్ కు ఫోన్ చేసి మీ వాళ్లు ప్లాట్ ఖాళీ చేశారా..? కనిపించడం లేదు.. ఎటువెళ్లారు అని ప్రశ్నించాడు.
హుబర్ట్ కు అనుమానం వచ్చి.. తన మరో కుమార్తెను అపార్ట్ మెంట్ వద్దకు వెళ్లి చూసిరావాలని సూచించాడు. మరో కుమార్తె లిసా ప్లాట్ వద్దకు వెళ్లి చూడగా.. లిసా, నాజిర్ మిల్లియెన్ బెడ్ పై చనిపోయి ఉన్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుంది. వారి మృతదేహాల పక్కనే నాలుగేళ్ల చిన్నారి ప్రామిస్ చాక్లెట్ తింటూ కనిపించింది. ఆమె ముఖం నిండా చాక్లెట్ పూసుకొని ఉండటంతో ఈగలు ముసురుకున్నాయి. ఈ దృశ్యాన్ని చూసి లీసా సోదరి భయాందోళనకు గురైంది. వెంటనే పోలీసులకు, చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని తెలిపారు. అయితే, లీసా, మిల్లియెన్ ఎలా చనిపోయారనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
లిసా కాటన్ తండ్రి హుబర్ట్ చెప్పినదాని ప్రకారం.. లిసా కొంతకాలంగా ఉబ్బసంతో బాధపడుతోంది. గుండెపోటుకు గురై చనిపోయి ఉంటుందని భావిస్తున్నా. నాజిర్ కు ట్యూబ్ ద్వారానే ఆహారం అందించాలి. నాలుగైదు రోజులు కావటంతో ఆహారం అందక నాజిర్ చనిపోయి ఉంటాడని తెలిపాడు. అయితే, పోలీసులు అన్నికోణాల్లో విచారణ చేస్తున్నారు. వీరిద్దరూ ఎలా చనిపోయి ఉంటారనే విషయాన్ని గుర్తించే పనిలోపడ్డారు.