కరోనాని ఖతం చేసే రహస్య ఆయుధం ‘మౌత్ వాష్’

Mouthwash may kill Covid and could be used to stop its spread సీటైల్పిరిడినియం క్లోరైడ్ కలిగిన మౌత్ వాష్ లు కరోనాని దాదాపు ఖతం చేయగలవని,వైరస్ వ్యాప్తి రేటుని తగ్గించగలవని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ మౌత్ వాష్ లలో ఉండే ద్రావణం..విరూసిడల్ ప్రభావాన్ని కలిగి ఉండి నోటిలోని 99శాతం పాథోజెన్స్ ని చంపేస్తుందని తెలిపారు. మల్టీనేషనల్ కన్య్జూమర్ గూడ్స్ కంపెనీ”యూనిలీవర్”పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ఇంకా సూక్ష్మంగా సమీక్షించాల్సి ఉంది.



ఈ అధ్యయనంపై ఇంగ్లాడ్ లోని కార్డిఫ్ యూనివర్శిటీలోని సిస్టమ్స్ ఇమ్యూనిటీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కో-డైరెక్టర్ ఫ్రొఫెసర్ వలెరీ ఓ డొన్నెల్ మాట్లాడుతూ…ఈ అధ్యయనం ఆశాజనకంగానే ఉందని,కానీ తదుపరి పరిశోధన అవసరమని తెలిపారు.



మరోవైపు,గతవారం ఇంగ్లాండ్ లోని లివర్ పూల్ సిటీలో మాస్ వీక్లీ టెస్టింగ్ ట్రయిల్ విజయవంతమవడంతో..మరో మూడు నగరాల్లో మాస్ వీక్లీ టెస్టింగ్ నిర్వహించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు. ఈ మాస్ టెస్టింగ్ ఉద్దేశ్యం…ఎవరికైతే వైరస్ వచ్చి..వైరస్ వచ్చిన విషయం తెలియకుండానే నయమైనపోయినటువంటి వాళ్లను గుర్తించడం. దీని ద్వారా అసింప్టమాటిక్(రోగ లక్షణాలు లేని)వ్యక్తుల సెల్ఫ్ ఐసొలేట్ అవొచ్చు.



కాగా,ప్రస్తుతం బ్రిటన్ లో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ లో మళ్లీ లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు గతవారం బోరిస్ జాన్సన్ సర్కార్ ప్రకటించింది. బట్టల దుకాణాలు,పబ్ లు,రెస్టారెంట్లతో సహా అత్యవసరయేతర వ్యాపారాలన్నీ బ్రిటన్ లో మూసివేయబడ్డాయి.



లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ బ్రిటన్ లో కరోనా కోరలు చాస్తూనే ఉంది. కరోనా మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. అయితే,మృతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇప్పటికే కరోనా రెండోదశ పీక్ స్టేజీని కూడా బ్రిటన్ దాటేసిందని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ నాటికి బ్రిటన్ లో పరిస్థితులు మెరుగుపడతాయన్నారు.బ్రిటన్ లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 12లక్షలకు చేరువలో ఉండగా,మరణాల సంఖ్య 50వేలకు చేరువలొో ఉంది.

ట్రెండింగ్ వార్తలు