Senegal Parliament: సెనెగల్ పార్లమెంట్‌లో రచ్చరచ్చ.. కుర్చీలతో కొట్టుకున్న ఎంపీలు.. వీడియో వైరల్
సెనెగల్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మస్సాట్ సంబ్ తోటి పార్లమెంట్ సభ్యురాలు యామి నదియా గింబేను తొలుత చెంపదెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో పార్లమెంట్ ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది.

Senegal Parliament
Senegal Parliament: సెనెగల్ పార్లమెంట్‌లో ఎంపీలు రచ్చరచ్చ చేశారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ తన్నుకున్నారు. అధికార, ప్రతిపక్ష రాజకీయ నేతల మధ్య పార్లమెంట్‌లో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పార్లమెంట్‌లోని ప్రతిపక్షనేత ఆగ్రహంతో ఊగిపోతూ మహిళా నాయకురాలు ముఖంపై కొట్టడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు ఎంపీలు కిందపడ్డారు. కొద్దిసేపటికి వారినిపక్కకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shooting Video: థాయిలాండ్‌లో భయానక ఘటన.. కాల్పుల్లో 22 మంది చిన్నారులు సహా 34 మంది మృతి
సెనెగల్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మస్సాట్ సంబ్ తోటి పార్లమెంట్ సభ్యురాలు యామి నదియా గింబేను తొలుత చెంపదెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో పార్లమెంట్ ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది. నదియా గింబే కుర్చీని తీసుకొని సంబవ్ వైపు దూసుకొచ్చింది. ఆమెను అడ్డుకొనేందుకు యత్నించిన మరో వ్యక్తి కిందపడిపోయాడు. ఒకరిపై ఒకరు కుర్చీతో దాడిచేసుకుంటుండగా తోటి సభ్యలుు వారిని పక్కకు తీసుకెళ్లారు. ఇరు పక్షాల సభ్యులు తీవ్రస్థాయిలో దూషణలు చేసుకున్నారు.
https://twitter.com/danielmarven/status/1598632121802797057?ref_src=twsrc%5Etfw%%5Etweetembed%7Ctwterm%5E1598632121802797057%7Ctwgr%5Ed4d97cfbf4869033dfabc4cc23b94ab4907418c9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-33769880314259474623.ampproject.net%2F2211182146000%2Fframe.html
ఈ ఏడాది జులై నెలలో జరిగిన ఓ ఎన్నికలో అధికార పార్టీ ఓడిపోయింది. అప్పటి నుంచి అధికార – ప్రతిపక్ష నేతల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా శుక్రవారం.. ప్రస్తుత దేశాధ్యక్షుడు సాల్‌కు మూడోసారి పదవి కట్టబెట్టడానికి ఓ ఆధ్యాత్మిక గురువు వ్యతిరేకంగా ఉన్నారు. ఎంపీ గంబే దీనిని తప్పుపట్టారు. ఆమె వైఖరిపై ప్రతిపక్ష నాయకుడు సంబ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సదరు మహిళా ఎంపీ ఆయన్ను వెక్కిరించడంతో ఈ దాడి జరిగింది.