Afghan Crisis :తమను జైళ్లకు పంపిన మహిళా జడ్జిల కోసం గాలిస్తున్న తాలిబన్లు..ప్రాణభయంతో దాక్కున్న వందలమంది న్యాయమూర్తులు

గతంలో తామకు శిక్షలు విధించి జైళ్లకు పంపిన మహిళా జడ్జీలపై తాలిబన్లు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. వారికి శిక్షలు తప్పవని హెచ్చరిస్తు వారి కోసంగాలిస్తున్నారు.

Female Afghan judges hunted by the murderers they convicted: అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు గతంలో తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని మట్టుబెడుతున్నారు.తమకు అడ్డం వస్తున్నవారిని అంతం చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తమకు శిక్షలు విధించి జైళ్లకు పంపించిన మహిళా జడ్జీల కోసం గాలిస్తున్నారు. వారికి తమమార్కు శిక్షలు తప్పవని తాలిబన్లు హెచ్చరిస్తున్నారు. వారు ఎక్కడ దాక్కున్నా పట్టి వారి అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో అఫ్గాన్ లో దాదాపు 220మందికిపైగా మహిళా న్యాయమూర్తులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ప్రాణాలకు దక్కించుకోవటానికి రహస్యంగా దాక్కుంటున్నారు.

Read more : Afghanistan : స్టే హోమ్..మహిళా ఉద్యోగులకు తాలిబన్ ఆదేశం

కానీ డేగకళ్లతో తాలిబన్లు వెదుకుతున్నారు. చిన్నపాటి సమాచారం అందినా వెంటనే రంగంలోకి దిగిపోయి సదరు మహిళా జడ్జీల కోసం గాలింపు ముమ్మరం చేశారు. దీంతో తాము ఎక్కడ తాలిబన్లకు చిక్కిపోతామో..వారి చేతుల్లో ఎటువంటి చిత్రహింసలు అనుభవించాల్సి వస్తోందోనని అనుక్షణం ప్రాణభయంతో హడలిపోతున్నారు. తాలిబన్ల నుంచి తప్పించుకోవటానికి ప్రాణాలతో బయటపడటానికి ఇప్పటికే కొంతమంది మహిళా జడ్జీలు దేశం వదిలిపోయారు. కానీ ఎటూవెళ్లలేక..వెళ్లే దారి లేక అప్ఘాన్‌లోనే ఉన్నవారు మహిళా జడ్జీలు మాత్రం అనుక్షణం ఛస్తూ బతుకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రహస్య ప్రాంతాలకు చేరుకుని ప్రాణాలు నిలుపుకునేందుకు నానా తంటాలుపడుతున్నారు.

Read more : Taliban : ఉగ్రవాదులను పెళ్లి చేసుకోవాలని..ఆఫ్ఘాన్ మహిళలపై ఒత్తిడి

అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల పరమయ్యాక జైళ్ల నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు. ఇటువంటి వారిలో గతంలో తాలిబన్లతో కలిసి పనిచేసిన వారు కూడా ఉన్నారు. వివిధ నేరాల్లో దోషులుగా తేలిన తాలిబన్లను అప్పట్లో మహిళా న్యాయమూర్తులు శిక్షలు విధించి జైళ్లకు పంపారు. దీనిని మనసులో పెట్టుకున్న తాలిబన్లు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. అలా జైలు నుంచి బయటకు రాగానే తమకు శిక్షలు విధించిన న్యాయమూర్తులకు హెచ్చరికలు పంపారు. ప్రతీకారం తప్పదని హెచ్చిరించారు. దీంతో 220 మందికిపైగా మహిళా న్యాయమూర్తులు ప్రాణభయంతో వణికిపోతూ రహస్య ప్రాంతాల్లో దాక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు